UBS OTT: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar)కాంబినేషన్లో 2012లో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు పీక్స్ కి చేరిపోయాయి. ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందని అందరూ వేయి కళ్ళతో ఎదురు చూశారు. ఇక మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అభిమానులలో మంచి హైప్ క్రియేట్ చేసింది. కానీ ఊహించిన స్థాయిలో ఆదరణ అందుకోలేకపోయింది.
ముఖ్యంగా హిందీలో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ధురంధర్ 2: ది రివేంజ్ మూవీతో పోటీ పడలేక రేస్ లో వెనుకబడిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కూడా ధురంధర్ సినిమాకే పట్టం కట్టారు అంటే ఈ సినిమా ఆడియన్స్ ను ఏ రేంజ్ లో మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటిటి రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూవీ ఇప్పుడు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది? ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కి రానుంది అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
వివరాలలోకి వెళ్తే.. ఈ సినిమాకు విడుదలకు ముందే డిజిటల్ రైట్స్ పరంగా భారీ డీల్ కుదిరింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ చిత్రాన్ని భారీ ధరకు సొంతం చేసుకుంది. ప్రముఖ సినిమా నిర్మాత నవీన్ ఎర్నేని ప్రెస్ మీట్ లో వెల్లడించిన ప్రకారం ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత సుమారు 5 వారాల గ్యాప్ తోనే ఓటీటీలోకి వస్తుంది అంటూ ఆయన తెలిపారు. ఇక ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తే ఈ సినిమా ఏప్రిల్ 24 లేదా మే మొదటి వారంలో స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు థియేటర్ రన్ ను బట్టి ఈ తేదీలలో మార్పులు కూడా ఉండవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ సినిమా ఇటు ఓటీటీలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ALSO READ:Sharwanand: జీవితంలో ఆ ముగ్గురిని ఎప్పటికీ మర్చిపోవద్దు -హీరో శర్వానంద్
శ్రీ లీల, రాశిఖన్నా హీరోయిన్లుగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో విలన్ గా ఆర్.పార్థిబన్ కనిపించారు. కేఎస్ రవికుమార్ , గౌతమి , రావు రమేష్, ప్రభాస్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. వై రవిశంకర్ దాదాపు 150 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 65.74 కోట్లు వసూలు చేసింది. అంటే కనీసం హరిహర వీరమల్లు ఫస్ట్ వీక్ రికార్డులను కూడా దాటలేకపోవడం గమనార్హం. మరి ఈ సినిమా 100 కోట్ల మార్క్ చేరడం చాలా కష్టంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.