E-Paper
Advertisement

Marnus Labuschagne: PSLకు ఓ దండం రా నాయ‌నా..పింక్ బాల్స్ వివాదంపై పాక్ ఇజ్జ‌త్ తీసిన‌ ల‌బుషేన్

Marnus Labuschagne: PSLకు ఓ దండం రా నాయ‌నా..పింక్ బాల్స్ వివాదంపై పాక్ ఇజ్జ‌త్ తీసిన‌ ల‌బుషేన్
Advertisement

Marnus Labuschagne:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament)  నిన్న అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ . లాహోర్ ఖలందర్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్‌మెన్ ( Lahore Qalandars vs  Hyderabad Kingsmen) మధ్య జరిగింది. ఇందులో లాహోర్ ఖలందర్స్ 69 పరుగుల తేడాతో విజయం సాధించి ఖాతా ఓపెన్ చేసింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ కింగ్స్ మెన్ కెప్టెన్ మార్నస్ లబుషేన్ ( Marnus Labuschagne) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ మధ్యలో పింక్ బాల్స్ వాడడంపై ( Pink Ball Controversy ) సీరియస్ అయ్యారు. దీని వల్ల తమ జట్టు ఓడిపోయిందని.. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో క్వాలిటీ లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా బంతి కలర్ మారడం తన క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరువు తీశారు. ఈ PSLకు ఓ దండం రా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Also Read: Tanveer Ahmed On PSL: ఛీ..ఛీ నిజంగా పాకిస్తాన్ బికారి దేశమే..కెప్టెన్స్‌ ప్రెస్ మీట్ ను పెళ్లి పందిరిగా మార్చారు క‌ద‌రా

బంతులు పింక్ క‌ల‌ర్ లో మార‌డం వెనుక ర‌హ‌స్యం

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న‌ లాహోర్ ఖలందర్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్‌మెన్ ( Lahore Qalandars vs  Hyderabad Kingsmen) మధ్య తొలి మ్యాచ్ జ‌రిగింది. ఇక ఈ మ్యాచ్ లో హైదరాబాద్ కింగ్స్‌మెన్ పింక్ క‌ల‌ర్ జెర్సీ ధ‌రించింది. ఈ క్ర‌మంలోనే మొద‌ట బౌలింగ్ చేసిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ ప్లేయ‌ర్లు, త‌ర‌చు బంతిని జెర్సీకి రుద్దారు. ఆ స‌మ‌యంలోనే జెర్సీకి ఉన్న రంగు బంతుల‌కు అంటింది. దీంతో వైట్ క‌ల‌ర్ బంతులు కాస్త‌, పింక్ లోకి మారిపోయాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఓన‌ర్స్ డ‌బ్బులకు క‌క్క‌ర్తి ప‌డి, నాణ్య‌త లేని, రంగుపోయే జెర్సీలు తీసుకొచ్చారు. అందుకే ఈ ప‌రిస్థితి నెల‌కొంది. ఈ సంఘ‌ట‌న నేప‌థ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప‌రువు తీస్తున్నారు ఫ్యాన్స్‌, మాజీలు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరువు తీసిన లబుషేన్

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ మొదటి మ్యాచ్ లో వైట్ కలర్ బంతులు పింక్ రంగులోకి మారడంపై స్పందించారు హైదరాబాద్ కింగ్స్ మెన్ కెప్టెన్ మార్నస్ లబుషేన్ ( Marnus Labuschagne). పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ అంటే భారీ ఎత్తున అంచనా వేసుకున్నాను.. కానీ నిన్నటితో అంచనాలు మొత్తం ఢ‌మాల్ అయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత చెండాలంగా బంతులు కలర్లు మారడం ఎక్కడ చూడలేదని ఫైర్ అయ్యారు. తమ ఓనర్లు నాణ్యతలేని జెర్సీలను తీసుకువచ్చారని సీరియస్ అయ్యారు. మ్యాచ్ మధ్యలో బంతులు పింక్ రంగులోకి మారడంతో ఓడిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడాలంటే సిగ్గు అనిపిస్తోందని PCB పరువు తీశారు. దీంతో లబుషేన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Also Read: IPL 2026 2nd Phase Schedule: ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..ఆ ఈవెంట్ ర‌ద్దు, ఫైన‌ల్స్ ఎప్పుడంటే

 

 

 

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×