Shani Vakri 2025: జులై 13, 2025న, శని గ్రహం తిరోగమనంలోకి ప్రవేశిస్తుంది. దీని ప్రభావం 12 రాశులపై కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా మీనం, వృషభం, తులారాశి వారికి, ఈ సమయం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అంతే కాకుండా శని గ్రహం యొక్క ఈ తిరోగమన గమనంతో.. ఈ రాశుల వారు కెరీర్, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలలో శుభవార్తలను పొందుతారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కర్మ ఫలాలను ఇప్పుడు సానుకూల రూపంలో పొందే అవకాశం కూడా ఉంది. మీనం, వృషభం, తులారాశి వారికి శని గ్రహణం ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ సమయం ఆర్థిక బలానికి చాలా శుభ సంకేతాలను తెస్తుంది. మీ 11వ ఇంట్లో శని తిరోగమనంలో ఉండటం వల్ల ఆదాయంలో ఊహించని పెరుగుదలకు దారితీస్తుంది. ఈ సమయంలో.. పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. అంతే కాకుండా మీ సామాజిక సంబంధాలు బలపడతాయి. మీరు కెరీర్‌లో మంచి పురోగతిని పొందుతారు. ఉద్యోగం చేస్తుంటే లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే.. మంచి ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించిన శుభవార్త కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తులా రాశి:
తులా రాశి వారికి, అదృష్ట స్థానంలో బృహస్పతి ఉదయించడం, ఆరవ ఇంట్లో శని తిరోగమనం చెందడం చాలా అనుకూలంగా ఉంటాయి. మీ పనిలో అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. మీరు పోటీ పరీక్షలలో లేదా కోర్టు సంబంధిత కేసులలో విజయం సాధించవచ్చు. వ్యాపారవేత్తలకు, కొత్త ప్రణాళికలను ప్రారంభించి లాభాలను ఆర్జించడానికి ఇది సమయం. ఈ సమయంలో ఉద్యోగులు తమ సామర్థ్యంతో తమ ఉన్నతాధికారులను ఆకట్టుకోవచ్చు. విద్య , ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు కూడా విజయవంతం అవుతాయి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. అంతే కాకుండా విద్యార్థులు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఉద్యోగులకు కూడా ఇది చాలా అనుకూలమైన సమయం.
Also Read: నవపంచమ రాజయోగం.. జులై 26 నుంచి వీరు పట్టిందల్లా బంగారం
మీన రాశి:
మీన రాశి వారికి గురువు యొక్క పెరుగుదల, శని యొక్క తిరోగమనం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. గురువు ఆనంద గృహంలో చురుకుగా ఉంటాడు. దీని కారణంగా కుటుంబంలో ఆనందం, శాంతి, సమతుల్యత ఉంటాయి. అదే సమయంలో.. శని లగ్న గృహంలో తిరోగమనం చెందడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేస్తాడు. ఈ సమయంలో.. మీకు కుటుంబం నుంచి మద్దతు కూడా లభిస్తుంది. అంతే కాకుండా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు . ఆస్తి సంబంధిత విషయాలలో పురోగతి ఉంటుంది. వాహనం లేదా స్థిరాస్తి నుంచి లాభం పొందే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు లభించవచ్చు.