Hari Hara VeeraMallu : మామూలుగా ఒక సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. రామ్ చరణ్ నటించిన ధ్రువ సినిమాతో ఈ ట్రెండ్ మొదలైంది. అంతకుముందు సినిమాకు సంబంధించి ఆడియో లాంచ్ ఫంక్షన్లు జరిగేవి. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా కూడా శిల్పకళా వేదికలో ఆడియో లాంచ్ ఈవెంట్లు జరిగేవి.
రీసెంట్ టైమ్స్ లో ఆడియో లాంచ్ ఈవెంట్లు కనుమరుగైపోయాయి. సినిమా నుంచి ఒక్కో పాటను రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేయడం ఒక ట్రెండ్. కొన్ని సినిమాలకు సంబంధించి ముందే ట్రైలర్ లో రిలీజ్ చేస్తుంటారు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో ఒక సప్రైజ్ అయితే ప్లాన్ చేస్తారు.
మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ కి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ఎప్పుడు లేని విధంగా సినిమాను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ ఈ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ప్రెస్ మీట్ కేటాయిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న శిల్పకళ వేదికలో జరిగిన విషయం తెలిసిందే. దానికంటే ముందు హైదరాబాద్లో ప్రెస్ మీట్ కూడా పెట్టారు. నేడు మంగళగిరిలో ప్రెస్ మీట్ పెట్టారు. ఇంక రేపు కూడా వైజాగ్ లో ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నాలుగు గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ తో పాటు చిత్ర యూనిట్ అంతా హాజరవుతారు. మొదటిసారి ఒక సినిమాకు రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరగడం.
సినిమా కోసం భారీ కష్టం
పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు అని చూస్తున్న ఈవెంట్స్ బట్టి అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ దీనికి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. ఈ సినిమాను బాగా ప్రమోట్ చేసినట్లయితే, సినిమా మంచి సక్సెస్ సాధించి కలెక్షన్స్ వస్తే దాన్నిబట్టి పవన్ కళ్యాణ్ కి రెమ్యూనరేషన్ వస్తుంది కాబట్టి ఇంతలా ప్రమోట్ చేస్తున్నారా అనేది కొంతమంది ఆలోచన. ఏదేమైనా రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేయడం అనేది మామూలు విషయం కాదు. అయితే ఇన్ని చోట్ల ఫంక్షన్స్ పెడుతున్నారు అంటే సినిమాలో విషయం ఏమైనా వీక్ గా ఉందా.? అనేది కొంతమంది అభిప్రాయం. ఏది ఏమైనా ఈ సినిమా ఫలితం రేపే తెలిసిపోతుంది.
Also Read: Hari Hara Veeramallu : రెమ్యునరేషన్ తీసుకోలేదు, ఇదెక్కడి ట్విస్ట్ అన్న.?