Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక సినిమా చేసిన తర్వాత ఎక్కువగా ప్రమోషన్స్ లో కనిపించరు. ఆ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రమే హాజరవుతారు. సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూస్ అన్నీ కూడా చిత్ర యూనిట్ ఇచ్చుకుంటుంది.
కానీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఎప్పుడూ లేనివిధంగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన మొదటి సినిమా ఇది.
రెమ్యునరేషన్ తీసుకోలేదు
వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు, చాలా కామెంట్స్ వినిపించాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి, డబ్బులు చాలా అవసరం కాబట్టి వరుసగా సినిమాలకు సైన్ చేశారు అని అందరూ అనుకున్నారు. కొంతమంది దగ్గర అడ్వాన్సులు తీసుకున్న మాట వాస్తవమే. అయితే హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ భారీగా తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ స్వయంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో ఈ సినిమాకు సంబంధించి రెమ్యూనరేషన్ ఇంకా తీసుకోలేదు అని క్లారిటీ ఇచ్చేశారు. సినిమా విషయంలో అన్ని బాగుంటే రెమ్యూనరేషన్ తీసుకుంటాను అని మాట్లాడారు.
ఎమ్మెల్యేలు కోరితే స్పెషల్ షో వేస్తాం
హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి మంగళగిరి వేదికగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టిన విషయం తెలిసిందే. దీంట్లో పలు రకాల ప్రశ్నలు పవన్ కళ్యాణ్ కు ఎదురయ్యాయి. సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ కొన్ని రాజకీయాలు విషయాలు గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. సినిమా కంటే రాజకీయాలకే నా ప్రాధాన్యత తెలియజేశారు. మీ ఎమ్మెల్యేలతో కలిసి ఈ సినిమా చూస్తారా, ఎందుకంటే అసెంబ్లీలో మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు… నేను ఇప్పటివరకు అది ఆలోచించలేదు, మీరు మంచి ఐడియా చెప్పారు. కూటమి ఎమ్మెల్యేలు కోరితే స్పెషల్ షో వేస్తాం అని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. వాళ్లు నన్ను రోజు చూస్తూ ఉంటారని కూడా తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేయడం వలన ఒక్కసారిగా ఈ సినిమా మీద హైప్ పెరిగిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన టికెట్లు కూడా ప్రస్తుతం హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి.
Also Read: Pawan Kalyan: జానీ ఫస్ట్ షో పడగానే, డిస్ట్రిబ్యూటర్స్, ఫైనాన్సియర్స్ నా ఇంటి మీదకి వచ్చేశారు.