Sreeleela New Look: సినీ నటి శ్రీ లీల (Sreeleela) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. ఇప్పటికే ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకుంటున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సుమారు రెండు మూడు సినిమాలకు ఈమె కమిట్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం క్షణం పాటు తీరిక లేకుండా వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న శ్రీ లీల త్వరలోనే మాస్ జాతర(Mass Jathara) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేశారు.
ఇలా సినిమా పనులలో ఎంతో బిజీగా ఉండే శ్రీ లీల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఈమె ఏజెంట్ మిర్చి(Agent Mirchi)గా మారిపోయారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను శ్రీ లీల సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అక్టోబర్ 19వ తేదీ అసలు సీక్రెట్ రివీల్ అవుతుందని తెలియజేశారు. ఇక ఈ పోస్టర్లో శ్రీ లీల హాట్ లుక్ లో రెడ్ చిల్లీలా ఘాటుగా కనిపిస్తున్నారనే చెప్పాలి. స్టైలిష్ లుక్, గాగుల్స్ తో ఈమె సరికొత్తగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారడంతో అభిమానులు ఈ పోస్టర్ పై ఎన్నో చర్చలు జరుపుతున్నారు.
ఈ పోస్టర్ కి సంబంధించిన అసలు విషయం అక్టోబర్ 19వ తేదీ రివీల్ అవుతుంది అయితే ఈ పోస్టర్ ఏ సినిమాకు సంబంధించింది అంటూ అభిమానులు చర్చిస్తున్నారు. బహుశా శ్రీ లీల మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ కు కమిట్ అయ్యి ఉంటారా అంటూ కొంతమంది సందేహాలను వ్యక్తం చేయగా మరికొందరు తన కొత్త వెబ్ సిరీస్ కి సంబంధించిన పోస్టర్ అయి ఉంటుంది అంటూ ఈ పోస్టర్ పై చర్చలు మొదలుపెట్టారు. మరి మిర్చి ఏజెంట్ గా శ్రీ లీల ఏ సినిమాలో కనిపించబోతున్నారు ఏంటి అనేది తెలియాలి అంటే అక్టోబర్ 19 వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే.
శ్రీ లీల తదుపరి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో ఈమె నటించిన మాస్ జాతర సినిమా అక్టోబర్ 31వ తేదీ విడుదల కాబోతోంది ఈ సినిమాతో పాటు తెలుగులో ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ సినిమాలు ఆషికి3, దోస్తానా 2 సినిమాలకు కమిట్ అయ్యారని తెలుస్తుంది.. ఇటీవల కాలంలో శ్రీ లీల నటించిన సినిమాలు సరైన విధంగా సక్సెస్ అందుకో లేకపోయినా ఈ ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు క్యూ కడుతున్నాయి. త్వరలోనే విడుదల కాబోయే మాస్ జాతర సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాతో అయిన శ్రీ లీల హిట్ అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం పడిగాపులు కాస్తున్న మరో డిజాస్టర్ డైరెక్టర్… అదే జరిగితే..