BigTV English

Akhanda 2 OTT: అఖండ 2 ఓటీటీ డీల్ క్లోజ్.. ఓటీటీ స్ట్రీమింగ్ కూడా అప్పుడేనా?

Akhanda 2 OTT: అఖండ 2 ఓటీటీ డీల్ క్లోజ్.. ఓటీటీ స్ట్రీమింగ్ కూడా అప్పుడేనా?
Advertisement

Akhanda 2OTT: బాలకృష్ణ (Balakrishna)త్వరలోనే అఖండ 2(Akhanda 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ డిసెంబర్ ఐదో తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. బాలకృష్ణ నటించిన మొట్టమొదటి సినిమా ,పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా విషయంలో ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో విడుదలకు అన్ని సిద్ధం చేశారనే తెలుస్తోంది.


భారీ డీల్ కుదుర్చుకున్న జియో హాట్ స్టార్..

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుపుకున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయిందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ (Jio Hot Star)తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించిన హక్కులను జియో హాట్ స్టార్ ఏకంగా 85 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుందని తెలుస్తోంది. అలాగే అన్ని భాషలలో సాటిలైట్ ధరలు స్టార్ మా రూ. 60 కోట్లకు కైవసం చేసుకున్నారు. ఈ సినిమా శాటిలైట్, ఓటిటి హక్కుల ద్వారానే సగం పెట్టుబడి మొత్తం రాబట్టినట్టు తెలుస్తోంది.

నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి?

ఇకపోతే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి కూడా ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమా డీల్ కుదుర్చుకునే సమయంలోనే జియో హాట్ స్టార్ 28 రోజుల థియేటర్ రన్ తర్వాత ఓటీటీలో ప్రసారమయ్యేలా డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది.. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాగా, వచ్చే ఏడాది జనవరి 1లేదా 2 వ తేదీలలోనే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది.. ఇలా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బాలయ్య అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.


సనాతన ధర్మ పరిరక్షణ..

నాలుగు వారాల తరువాత ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుందని ముందుగా వెల్లడించడంతో ప్రేక్షకులు పెద్దగా థియేటర్ కు రావడానికి ఆసక్తి కనబరచరని, తద్వారా కలెక్షన్ల పై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ విషయాలకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలబడునుంది. ఈ సినిమా విషయానికి వస్తే సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. బాలకృష్ణ సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ ఇతర అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయి. ఇక ఈ అప్డేట్స్ చూస్తుంటే మాత్రం సినిమా బ్లాక్ బాస్టర్ అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Sreeleela New Look : హాట్ హాట్ ‘మిర్చి’ ఏజెంట్… శ్రీలీల కొత్త లుక్ చూశారా ?

Related News

Jr.NTR Dragon OTT : ఓటీటీ లవర్స్‌కు షాక్ ఇచ్చిన ఎన్టీఆర్… డ్రాగన్‌తో అంత ఈజీ కాదు

OG: ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న ఓజీ .. ఎప్పుడు? ఎక్కడంటే?

War 2: థియేటర్లలో బొక్కబోర్లా.. ఓటీటీలో రికార్డు సృష్టించిన వార్ 2!

OTT Movie : 2 గంటల 11 నిమిషాల మలయాళం మూవీ… IMDbలో 9.4 రేటింగ్… క్షణక్షణం ఉత్కంఠ రేపే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : మేనమామ చావుకు రివేంజ్… ఓటీటీని షేక్ చేస్తున్న కొరియన్ సిరీస్… యాక్షన్ ప్రియులకు పండగే

OTT Movie : డివోర్స్ కావాలంటే ప్రాణాలు తీసే దెయ్యం… హర్రర్ సీన్లతో తడిపించే స్టోరీ… ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : మొగుడు పోగానే క్యూ కట్టే కేటుగాళ్ళు… డబ్బు కోసం అంతమందితో… అలాంటి సీన్లున్న సినిమానే

Big Stories

×