Payal Rajput:సినిమా ఛాన్స్ వస్తే చాలు అనుకుని ఎగిరి గంతేసి మరి సినిమా చేస్తారు. కానీ సినిమా పూర్తి అయి డబ్బులు చేతులు పడ్డాక మాత్రం అదే సినిమా పై దుమ్మెత్తి పోస్తారు. గతంలో తాప్సి , తమన్న,జాన్వీ వంటి హీరోయిన్లు ఇలా చేసిన వారే. ఇప్పుడు అదే బాటలో రాధిక = ఆప్టే కూడా తనదైన సంచల కామెంట్స్ తో టాలీవుడ్ లో దుమారం రేపింది.
విషయంలోకి వెళ్తే అక్క వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా కీర్తి సురేష్ ,రాధిక ఆప్టే ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగతి తెలిసిందే .ఇక తాను తెలుగులో చేసిన ఒక సినిమాలో తనకంటే పెద్ద వయసును ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, అలాంటి కథ తనకసలు అర్థం కాలేదని చెప్పుకొచ్చింది .అయితే ఆమె మాట్లాడింది లెజెండ్ సినిమా గురించి అని గుర్తుపట్టేశారు తెలుగు ప్రేక్షకులు .దీంతో సినిమా చేసినప్పుడు అనాల్సిన మాటలు ఇప్పుడు అనడం ఏంటి అని డబ్బులు పుచ్చుకున్నాక మాట్లాడడం సరికాదు అంటూ మండిపడ్డారు సినిమా చేస్తున్నప్పుడే ఆమాటలు చెప్పాలి, నచ్చకపోతే తప్పుకోవచ్చని, అలాంటిది అయిపోయిన సినిమా గురించి ఇప్పుడు ఇలా చేయడమేంటని ఫైర్ అయ్యారు.
తాప్సి పన్ను కూడా ఝుమ్మంది నాదం సినిమా సమయంలో రాఘవేందర్రావు తన బొడ్డుపై కొబ్బరికాయ వేయించిన సీన్ గురించి మాట్లాడిన తీరు అప్పట్లో చర్చకు వచ్చింది కూడా .అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తనకు టాలీవుడ్ ఎంతో పేరు తెచ్చిపెట్టిందని, ముఖ్యంగా నేను గర్వంగా తెలుగు నటిని అని చెప్పుకుంటానని చెప్పుకొచ్చింది నాకు పేరు గుర్తింపు తెచ్చిన పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమ అని ఈ పరిశ్రమ నాకు అందించిన ప్రతి అవకాశాన్ని ప్రతి అనుభవాన్ని స్వీకరించి ఇక్కడే ఎదిగాను అని, అలాంటిది ఇన్నేళ్ల తర్వాత ఆ ఇండస్ట్రీనే తప్పు పట్టడం అంటే అంటే కృతజ్ఞత మర్చిపోవడమే అంటూ ఘాటుగా కామెంట్ చేసింది .
అంతే కాదు తన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి తనని స్థాయికి తీసుకొచ్చిన పరిశ్రమ మొత్తాన్ని తప్పు పట్టడం సరైన పద్ధతి కాదంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. తాను ఏ స్థాయిలో ఉన్నప్పటికీ అందుకు టాలీవుడ్ మాత్రమే కారణమని తనకు అండగా నిలిచిన పరిశ్రమకు ఎప్పటికీ అండగా ఉంటానని స్పష్టం చేసింది .
పాయల్ రాజ్ పుత్ విషయానికి వస్తే ఆర్ఎక్స్ 100 సినిమా ఈ అమ్మడికి ఎంత పేరు తెచ్చిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని ఇందు పాత్రతో తెలుగు ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోయారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ప్రస్తుతం లైమ్ లైట్ లో లేదనే చెప్పాలి. ఏదేమైనా రాధిక ఆప్టే చేసిన కామెంట్స్ కి పాయల్ రాజ్ పుత్ కౌంటర్ ఇచ్చిందంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు .చూడాలి మరి పాయల్ రాజ్ పుత్ దారిలో ఇంకెంతమంది నడుస్తారో !
https://twitter.com/starlingpayal/status/2117951800422834605/video/1