Inzamam ul Haq On IND VS NZ ODI: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య బుధవారం 5 మ్యాచ్ ల వన్డే సిరీస్ షురూ అయింది. ఈ సిరీస్ నేపథ్యంలో తొలి వన్డే ఆక్లాండ్ వేదికగా జరుగగా న్యూజిలాండ్ పై 5 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది గిల్ సేన. ఈ మ్యాచ్ కు రెండు సార్లు వర్షం అడ్డంకిగా మారడంతో డక్ వర్త్ లుయిస్ పద్దతి ప్రకారం టార్గెట్ కుదించారు. దీంతో అవలీలగా టీమిండియా విక్టరీ కొట్టేసింది. అయితే, దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ( Inzamam ul Haq) స్పందిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆక్లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రెండు సార్లు వర్షం పడటంతో టీమిండియా బతికి బయటపడిందని బాంబ్ పేల్చాడు. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించకపోయింటే, కివీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పిచ్ బౌలర్లకు పూర్తిగా అనుకూలించిందని.. దీంతో టీమిండియా 185 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయేదంటూ వ్యాఖ్యానించాడు. వరుణుడే టీమిండియా కాపాడంటూ పేర్కొన్నాడు. దీంతో ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య బుధవారం జరిగిన తొలి వన్డేపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ తన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో వర్షం పడకపోయింటే టీమిండియా 100 పరుగులలోపే కుప్పకూలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆక్లాండ్ లో 2003 నుంచి ఇప్పటి వరకు టీమిండియా గెలవలేదని, ఈ గ్రౌండ్ లో న్యూజిలాండ్ కు తిరుగులేదన్నాడు. కానీ పిచ్ పరిస్థితులు మారడంతో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారన్నాడు. అందుకే న్యూజిలాండ్ 185 పరుగులకే కుప్పకూలినట్టు తెలిపాడు. అదే స్టైల్ లో టీమిండియా బ్యాటర్లు కూడా ఔట్ కావడం గ్యారెంటీ అని తాను అనుకున్నట్టు వెల్లడించాడు. కానీ మధ్య వర్షం వచ్చి, టీమిండియాను కాపాడినట్టు చెప్పుకొచ్చాడు. వర్షం పడినా కోహ్లీని త్వరగా ఔట్ చేసి ఉండింటే… టీమిండియా 100 పరుగులలోపే కుప్పకూలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కివీస్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ తరుణంలోనే 40.2 ఓవర్లు ఆడిన న్యూజిలాండ్ 185 పరుగులకు కుప్పకూలింది. ఇక మ్యాచ్ కు వర్షం పడటంతో టార్గెట్ ను 143 పరుగులకు కుదించారు. ఈ టార్గెట్ ను 22.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టపోయి టీమిండియా ఛేదించింది. ఈ విజయంతో 1-0 లీడ్ సాధించింది భారత జట్టు.