SDRF Rescue: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో చెరువులో 8మంది మత్సకారులు చిక్కుకుపోయారు. అయితే వీరిని కాపాడేందుకు SDRF సిబ్బంది వెల్లింది. ముందుగా 3 ని SDRF బృందం కాపాడింది. మరో 5మందిని కాపాడే ప్రయత్నంలో అలుగులో రెండు SDRF బోట్లు కొట్టుకుపోయాయి. ఈ ప్రమాద సమయంలో రెండు బోట్లలో 13మంది SDRF సిబ్బంది ఉన్నట్టు సమాచారం.
అయితే కొట్టుకున పోయిన నలుగురిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు కానీ.. మరల మరో ముగ్గురిని తీసుకొచ్చేందుకు వెళ్తున్న క్రమంలో రెస్క్యూ బృందాల బోట్లు కొట్టుకుపోయాయి. దీంతో బేతుపల్లి చెరువు అలుగు కిందకు ఎస్డీఆర్ ఫ్ బృందం వెల్లింది. మరో SDRF బృందం కోసం మరో బోటు సాయంతో SDRF సిబ్బంది వెతుకుతున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువులో చిక్కుకున్న జాలర్లను కాపాడేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్లు గల్లంతుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. దీంతో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం కీలక సూచనలు చేశారు.
Also Read: ‘హిందూ కాలేజ్‌ను ప్రైవేటీకరిస్తే ఊరుకోం’.. కేంద్రానికి కవిత హెచ్చరిక!