E-Paper
Advertisement

నిహారిక స్టైల్‌కు ఫిదా అవ్వాల్సిందే.. ఏం పోజులమ్మా!

నిహారిక స్టైల్‌కు ఫిదా అవ్వాల్సిందే.. ఏం పోజులమ్మా!
Advertisement

Niharika Konidela:మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అభిమానులని ఫిదా చేస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ప్రొడక్షన్ పనులతో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ మెగా భామ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె పెట్టిన ‘డీల్ మీ ఎ లుక్’ అనే క్యాప్షన్ నెటిజన్లను ఫిదా చేస్తుంది.

తాజా ఫొటోల విషయానికి వస్తే నిహారిక డిఫరెంట్ అండ్ క్లాసీ లుక్‌లో కనిపిస్తు రచ్చ చేస్తుంది.ఒక వైట్ కలర్ షర్ట్‌కు పర్పుల్ కలర్ డిజైన్‌తో కూడిన ప్రత్యేకమైన హార్ట్ షేప్ అవుట్‌ఫిట్‌ను యాడ్ చేయడం,పైగా దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్‌గా బ్లాక్ కలర్ బాటమ్ వేర్ సెలెక్ట్ చేయడం చూస్తుంటే నిహారిక ప్యాషన్ సెన్స్ ఎలా ఉంటుందో అర్థం అవుతుంది.ఇక మేకప్ విషయానికి వస్తే పెద్దగా హడావుడి లేకుండా సింపుల్‌గా ,అలాగే చెవులకు అందమైన ఇయర్ రింగ్స్ పెట్టుకుని, నీట్‌గా హెయిర్ స్టైల్ చేసుకోవడంతో నిహారిక చాలా డీసెంట్‌గా ఉందంటూ కామెంట్స్ విసురుతున్నారు ఫాలోవర్స్.

Advertisement

ముఖ్యంగా ఈ ఫొటోల్లో ఆమె ఇచ్చిన పోజ్ ఆ లుక్‌కు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. చేతులు కట్టుకుని, చిన్న చిరునవ్వుతో కెమెరా వైపు చూస్తున్న తీరు చాలా స్టైలిష్‌గా ఉండటంతో పాటు ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని కూడా స్పష్టంగా చూపిస్తోంది. వెనుక ఉన్న గ్రీన్ కలర్ బ్యాక్‌డ్రాప్ మధ్యలో నిహారిక వేసుకున్న వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ దుస్తులు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఫ్యాషన్ ఫొటోషూట్ అంటే ఎప్పుడూ గ్లామరస్‌గా ఉండే అవుట్‌ఫిట్లే వేసుకోవాల్సిన అవసరం లేదని, సింపుల్ అండ్ ట్రెండీ దుస్తుల్లో కూడా ఎంతో అందంగా, ప్రత్యేకమైన స్టైల్‌తో కనిపించవచ్చని ఈ ఫొటోలు నిరూపిస్తున్నాయి.

నిజానికి మెగా కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని నిహారిక మొదటి నుంచీ గట్టిగా ప్రయత్నిస్తున్నది తన జర్నీ చూస్తేనే అర్థం అవుతుంది.నటిగా తన కెరీర్‌ను మొదలుపెట్టి టాలీవుడ్‌లో పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటించి మెప్పించింది కూడా.అయితే కేవలం నటనకే పరిమితం కాకుండా ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగానూ మారి కమిటీ కుర్రాళ్ళు వంటి నేషనల్ అవార్డు ని కూడా సొంతం చేసుకోవడం విశేషం.ఇక ప్రస్తుతం పాకెట్ రాకెట్స్ అనే సినిమాని డిసెంబర్ 11న  రిలీజ్ కి రెడీ చేసింది కూడా .

Advertisement

ALSO READ :రాధిక ఆప్టేకు పాయల్ కౌంటర్.. టాలీవుడ్‌కు అండగా హీరోయిన్!

ఇక సినిమా అప్ డేట్స్ తో పాటు తన పర్సనల్ ఇంట్రెస్ట్స్ , ట్రెండీ ఫ్యాషన్, సరికొత్త ఫొటోషూట్‌లకు సంబంధించిన అప్‌డేట్స్‌ను కూడా నిహారిక ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.అలా ఇపుడు కూడా ‘డీల్ మీ ఎ లుక్’ అంటూ నిహారిక పెట్టిన క్యాప్షన్ ఈ ఫొటోలు కూడా ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. మొత్తానికి మెగా డాటర్ లేటెస్ట్ ఫొటోలు ఆమె అభిమానులకు మంచి స్టైల్ ట్రీట్ ఇస్తున్నాయనడం లో సందేహం లేదు.

Tags

Related News

అమ్మానాన్నలకు రూ.50 లక్షల గిఫ్ట్స్.. ప్రజ్వల్ ప్లాన్ మామూలుగా లేదుగా!

రాధిక ఆప్టేకు పాయల్ కౌంటర్.. టాలీవుడ్‌కు అండగా హీరోయిన్!

12 ఏళ్లకే ఇంత కాన్ఫిడెన్సా? ప్రజ్వల్ మామూలోడు కాదు!

తమిళ సినిమాల వెంటపడుతున్న నాగవంశీ.. జైలర్ 2 తరువాత మరో మూవీ రిలీజ్ కు సిద్ధం!

రామాయణ సినిమాకు దిల్ రాజు రివ్యూ.. ఆ పాత్ర పై ప్రశంసలు!

తెలుగు సినిమాలపై రాధిక ఆప్టే రగడ.. ఇదేం లెక్క?

నితిన్ నార్ణేకు ఏమైంది? భుజానికి సర్జరీ.. ఇప్పుడెలా ఉందంటే?

Big Stories

Advertisement
×