2026 summer movies: ప్రతిసారి భారీ బడ్జెట్ సినిమా విడుదలవుతుంది అంటే ప్రేక్షకులకి ఒక పండగ రకమైన వాతావరణ మొదలవుతుంది. అయితే ఒకప్పుడు సినిమా పండగ అనేది కనీసం మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఒక హీరో నుంచి రెండేళ్లకు ఒక సినిమా, మూడేళ్లకు ఒక సినిమా విడుదలవడం వలన ప్రేక్షకులు కూడా అప్పుడే థియేటర్ కు వెళ్తున్నారు. అందుకే థియేటర్ కి కూడా జనాలు రావడం తగ్గిపోయింది అని కొంతమంది నిర్మాతలు అంటుంటారు.
ఇకపోతే 2025 లో వచ్చిన పెద్ద సినిమాలేవి ఊహించిన స్థాయిలో ఆడలేదు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి. ఇకపోతే 2026 మాత్రం సినిమా ప్రేమికులకు పండగ అని చెప్పాలి. ఒక సినిమా తర్వాత ఒక సినిమా అనౌన్స్మెంట్ వచ్చి 2026 సమ్మర్ అంతా అద్భుతమైన సినిమాలతో నిండిపోయింది.
2026 సమ్మర్ సినిమాలు
మామూలుగా సమ్మర్ అంటే మార్చి నుంచి మొదలైపోతుంది. మార్చి నెల చివర్లో బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా మొదట విడుదల కానుంది. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న పారడైజ్ సినిమా విడుదల కానుంది. సుకుమార్ శిష్యులు దర్శకత్వం వహిస్తున్న ఈ రెండు వేరువేరు సినిమాలు మంచి అంచనాలతో ఉన్నాయి.
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. ఒకరకంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి పండుగ అని చెప్పాలి. ఎందుకంటే సంక్రాంతికి రాజా సాబ్ సినిమా సిద్ధంగా ఉంది. ఇంకో మూడు నెలల వ్యవధిలోని మరో ప్రభాస్ సినిమా విడుదలవుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కానుంది.
మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా విశ్వంభర. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మే నెలలో విడుదల అవుతుంది అని వార్తలు వస్తున్నాయి. అలానే అడవి శేష్ నటిస్తున్న గూడచారి సినిమా కూడా అదే నెలలో విడుదల కానుంది. ఇవన్నీ కాకుండా జూన్ నెలలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
మరికొన్ని సినిమాలు
2026 జూన్ వరకు అన్ని సినిమాలు డేట్స్ అయితే సెట్ చేసుకున్నాయి. కానీ ఆ డేట్ కి వస్తారా రారా అనేది తర్వాత తేలుతుంది. వీటితోపాటు విజయ్ దేవరకొండ సినిమా 2026లో విడుదలవుతుంది. అఖిల్ నటిస్తున్న లెనిన్. నాగచైతన్య 24వ సినిమా. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న సూర్య 46వ సినిమా కూడా సమ్మర్ లిస్టులో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. వీటి రిలీజ్ డేట్స్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Also Read : OG Movie : రిలీజ్‌కి ముందే ఓజీ విధ్వంసం… పుష్ప 2, కల్కి రికార్డులు బద్దలు