Peddi Movie : టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిపుల్ ఆర్ తర్వాత భారీ అంచనాలతో గేమ్ చేంజర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించారు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈసారి ఎలాగైనా సరే బ్లాక్ బాస్టర్ హిట్ కొడతాను అంటూ పెద్ద సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్.. ఉప్పెన ఫ్రేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్సు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా వచ్చేయడాది రిలీజ్ కాబోతుందని ప్రకటించారు. తాజాగా ఈ మూవీ నుంచి రామ్ చరణ్ క్రేజీ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
‘పెద్ది’ రామ్ చరణ్ క్రేజీ లుక్..
గతంలో ఎన్నడూ కనిపించిన విధంగా రామ్ చరణ్ ఈ సినిమాలో రఫ్ అండ్ టఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఆ లుక్ ని బుచ్చిబాబు డిజైన్ చేశారు. అయితే ఇప్పుడు ఆ లుక్ తో పాటు మరో లుక్ లో కూడా రామ్ చరణ్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా రామ్ చరణ్ న్యూ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ మరో మేకోవర్ కి సిద్ధం అవుతున్నట్టు మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందించారు.. ఆ వీడియోలో ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అలీ హకీమ్ తో విజువల్స్ మంచి ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి.. మరి ఈ మూవీలో చరణ్ లుక్ ఎలా ఉంటుందో చూడాలి..
‘పెద్ది ‘ షూటింగ్ అప్డేట్..
పెద్ది మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ ఓ సాంగ్ ను షూట్ చేయగా, త్వరలోనే మరో సాంగ్ ను షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. జాన్వీ కపూర్, చరణ్ పై ఓ సాంగ్ చిత్రీకరణ ఉండనుంది. వీరిద్దరూ కలిసి మొదటి సారి స్క్రీన్ ను షేర్ చేసుకోబోతున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడ్డానికి అందరూ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది..
?igsh=ejZzZ25yNnQxbmd4
Also Read: పాన్ ఇండియా హీరోనే లైన్లో పెట్టేసింది.. అస్సలు ఊహించి ఉండరు సుమీ..!
రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే..
పెద్ది మూవీ తర్వాత రామ్ చరణ్ వరుసగా నాలుగు ప్రాజెక్టు లలో నటించనున్నారని సమాచారం.. ముందుగా రంగస్థలం 2 మూవీలో నటించనున్నారు. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. గతంలో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న త్రిపుల్ ఆర్ మూవీకి సీక్వెల్ గా మరో చిత్రం రాబోతుంది. దీని తర్వాత మరో రెండు ప్రాజెక్టులలో నటించనున్నారని సమాచారం.. త్వరలోనే వాటి గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.