Nigeria boat tragedy: నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 40 మంది వరకు గల్లంతు అయ్యారు. కేవలం 10 మంది మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. మిస్సయినవారి కోసం నదిలో గాలింపు జరుగుతోంది. అసలేం జరిగింది?
ఆఫ్రికా ఖండంలో చాలా దేశాలకు రోడ్ల సమస్య వెంటాడుతోంది. ఎక్కడికైనా వెళ్లాలన్నా చాలా దేశాల ప్రజలు నదులు, సముద్రాల మీదుగా ప్రయాణాలు చేయాల్సివస్తోంది. ఆ తరహా ప్రయాణాలు చివరకు వారి ప్రాణాల మీదకు తెస్తోంది. అలాంటి ఘటన ఒకటి నైజీరియాలో చోటు చేసుకుంది.
నైజీరియాలోని వాయువ్య సోకోట్ రాష్ట్రం నుంచి స్థానిక గోరోన్యో మార్కెట్‌కు 50 మంది ప్రయాణికులతో బోటు వెళ్తోంది. అయితే బరువు ఎక్కువ కావడంతో నది మధ్యలోకి వెళ్లిన తర్వాత బోటులోకి క్రమంగా నీరు రావడం మొదలైంది. నదిలో బోల్తా పడింది. ఘటనలో సమయంలో బోటులో దాదాపు 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు.
మార్కెట్ నుంచి దినుసులు తెచ్చుకోవడానికి వీరంతా వెళ్తున్నారు. 10 మంది మాత్రమే సిబ్బంది రక్షించారు. మరో 40 మంది వరకు మిస్సయ్యారు. వారి జాడ తెలియలేదని జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ వెల్లడించింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు ఆదేశ భద్రతా దళాలు వెల్లడించాయి.
ALSO READ: చైనా సింపతీ.. ట్రంప్ అంతర్యం ఏంటి?
మూడు వారాల కిందట ఉత్తర-మధ్య నైజీరియాలోని నైజర్ రాష్ట్రంలో సుమారు 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కనీసం 13 మంది మరణించారు. డజన్ల కొద్దీ మంది గల్లంతయ్యారు. నైజీరియాలో జలమార్గాలపై నియంత్రణ లేకపోవడం వల్ల పడవ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి.
వర్షాకాలంలో నదులు, సరస్సులు పొంగి పొర్లుతాయి. గతేడాది ఇదే నెలలో సోకోటో రాష్ట్రంలో నది మీదుగా వరి పొలాలకు తీసుకెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది రైతులు మరణించారు. అదే ఏడాది జూలై 29న వాయువ్య జిగావా రాష్ట్రంలో వ్యవసాయ పనుల నుండి ఇంటికి తీసుకెళ్తున్న పడవ నది మధ్యలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు యువతులు చనిపోయారు. రెండు రోజుల కిందట మధ్య నైజర్ రాష్ట్రంలో జరిగిన మరో పడవ ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలైన విషయం తెల్సిందే.