Rao Bahadur Teaser:ప్రముఖ నటుడు సత్యదేవ్ (Sathyadev) ప్రధాన పాత్రలో తాజాగా నటిస్తున్న చిత్రం రావు బహదూర్ (Rao Bahadur). వెంకటేష్ మహా (Venkatesh Maha) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి GMB ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu), ఆయన సతీమణి, ప్రముఖ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar)సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) విడుదల చేశారు. నిజానికి మహేష్ బాబు సమర్పిస్తున్న సినిమా అంటేనే.. ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి . దీనికి తోడు ఇప్పుడు టీజర్ ని రాజమౌళి విడుదల చేశారని తెలియడంతో మరింత అంచనాలు పెరిగిపోయాయి అని చెప్పవచ్చు.
రావు బహదూర్ టీజర్..
ఇక టీజర్ విషయానికి వస్తే..” నాకు అనుమానం అనే భూతం పట్టింది” అంటూ ఆసక్తికరమైన డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభం అవుతుంది. సైకాలజికల్ డ్రామాగా దీనిని తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. మరి వచ్చే వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని చెప్పవచ్చు.
విభిన్నమైన గెటప్ లో సత్యదేవ్..
ఇకపోతే సైకాలజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యదేవ్ విభిన్న గెటప్లో కనిపిస్తున్నారు. ఊహించని ఎలిమెంట్స్ తో బొమ్మ అదిరిపోయేలా ఉందని టీజర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ముఖ్యంగా టీజర్ చూసిన ఆడియన్స్ సత్యదేవ్ నటన పైనే కాదు ఆయన గెటప్పుపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మునుపెన్నడు లేని విధంగా ఈ సినిమాలో సరికొత్త పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను జిఎంబి ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తూ ఉండగా.. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
సత్యదేవ్ సినీ కెరియర్..
సత్యదేవ్ కెరియర్ విషయానికి వస్తే.. తెలుగులో టాలెంటెడ్ యాక్టర్లలో ఒకరిగా ముద్ర వేసుకున్నారు. చదువుకునే రోజుల్లోనే సినిమాల మీద ఉన్న ఇష్టంతో షార్ట్ ఫిలిం మేకర్ గా మారిన ఈయన.. ఒకవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే.. మరొకవైపు సినిమాలలో అవకాశాల కోసం తిరిగేవారు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ తర్వాత హీరోగా పలు చిత్రాలు చేశారు. అంతేకాదు విలన్ గా సినిమాలలో ఆకట్టుకున్న ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా ప్రత్యేక గుర్తింపును అందుకున్నారు. ఇక ఇటీవలే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ‘కింగ్డమ్’ సినిమాలో హీరోకి అన్నగా నటించిన ఈయన తాజాగా ‘అరేబియా కడలి’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న వెంకటేష్ మహా..
ఇకపోతే మంచి పాత్ర పడాలే కానీ వెండితెరపై చెలరేగిపోయే నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు సత్యదేవ్. ఇప్పుడు రావు బహదూర్ తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. అటు కేర్ ఆఫ్ కంచరపాలెం ఇటు ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో మంచి గుర్తింపు అందుకున్న వెంకటేష్ మహా.. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
also read:Anasuya: అవే మెయిన్ టార్గెట్ అంటున్న అనసూయ.. భారీగానే సంపాదిస్తోందే!