E-Paper
Advertisement

జననాయగన్ రేర్ ఫీట్..ఫస్ట్ ఇండియన్ యాక్టర్ గా విజయ్ దళపతి!

జననాయగన్ రేర్ ఫీట్..ఫస్ట్ ఇండియన్ యాక్టర్ గా విజయ్ దళపతి!
Advertisement

Jana Nayagan:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దళపతి.. ఎట్టకేలకు ఈ ఏడాది టీవీకే పార్టీ స్థాపించి తొలి ప్రయత్నంలోనే ఏకంగా తమిళనాడుకు ముఖ్యమంత్రిగా అవతరించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయన చివరి సినిమా ‘జననాయగన్’ సుమారుగా ఏడు నెలల వాయిదాల తర్వాత ఎట్టకేలకు విడుదలయ్యింది. జూలై 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితం అవ్వగా క్లైమాక్స్ లో ఎండ్ కార్డ్స్ పడే సమయంలో విజయ్ తన కెరీర్ లో నటించిన విభిన్నమైన పాత్రలకు సంబంధించిన క్లిప్స్ వేయగా.. వాటిని చూసి అభిమానులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక మళ్ళీ విజయ్ ను అలా చూడలేమంటూ ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి.

విడుదలకు ముందే సరికొత్త రికార్డు సృష్టించిన జననాయగన్..

జననాయగన్ విషయానికొస్తే.. ఈ సినిమా విడుదలకు ముందే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమా రేర్ ఫీట్ అందుకొని విజయ్ ని ఇండియాలోనే.. అలాంటి రికార్డు సృష్టించిన తొలి హీరోగా నిలబెట్టింది. మరి విజయ్ సినిమా సాధించిన ఆ  రికార్డు  ఏమిటో ఇప్పుడు చూద్దాం. విషయంలోకి వెళ్తే.. ఒక టికెటింగ్ ప్లాట్ ఫామ్ లో 10 లక్షల టికెట్లు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది.. ఇక మరో ఆశ్చర్యకరమైన ఏమిటంటే మొదటి షో ప్రారంభం కాకముందే అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా ఘనత సాధించింది. అంతేకాదు ఈ ఏడాది విడుదలలో అతిపెద్ద చిత్రాలలో ఒకటిగా చేరింది.

అలాంటి హ్యాట్రిక్ అందుకున్న తొలి హీరోగా విజయ్..

Advertisement

ఇకపోతే వరుసగా విజయ్ దళపతి చిత్రాలు మూడోసారి వన్ మిలియన్ కి పైగా ప్రీ సేల్స్ మైలురాయిని సాధించి చరిత్ర సృష్టించారు. ఇప్పటికే విజయ్ నటించిన వరిసు, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చిత్రాల సరసన ఈ చిత్రం చేరింది. ఈ ఘనతతో ఆన్లైన్ టికెటింగ్ ఫ్లాట్ ఫామ్ లో 10 లక్షలకు పైగా ప్రీ సేల్స్ జరిగి హ్యాట్రిక్స్ అందుకున్న తొలి భారతీయ నటుడిగా విజయ్ సరికొత్త రికార్డు అందుకున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన నిలకడ , ఆయనకు ఉన్న సాటిలేని అభిమాన గణానికి అభిమానులు అభినందనలు తెలపడంతో ఈ మైలురాయి వేగంగా ఇంటర్నెట్లో వైరల్ అయిపోయింది. మొత్తానికి అయితే రికార్డు స్థాయిలో జరిగిన అడ్వాన్స్ బుకింగ్ కారణంగానే.. వివిధ ప్రాంతాల నుండి హౌస్ ఫుల్ షోలు, పైగా విజయ్ చివరి సినిమా కావడంతో.. థియేటర్ ల వద్ద పెద్ద ఎత్తున పండగ వాతావరణం కనిపించింది.

ALSO READ: చెన్నై లవ్ స్టోరీ ట్విట్టర్ రివ్యూ.. రొమాంటిక్ డ్రామాతో కిరణ్-గౌరీ జంట మెప్పించిందా?

విజయ్ చివరి సినిమా..

Advertisement

హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దళపతి సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. కూతురి పాత్రలో మమిత బైజు నటించింది. ప్రకాష్ రాజ్ , ప్రియమణి, గౌతమ్ మీనన్ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు ఇకపోతే విడుదలకు ముందే అత్యధిక టికెట్లు అమ్ముడుపోయి రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.

Related News

ముద్దు సీన్ ఉంటే అడల్ట్ సినిమా అవుతుందా? ట్రోలర్స్ కు నాగ వంశీ కౌంటర్!

ఫ్యామిలీ ఆడియన్స్ తో కలిసి చూసే సినిమా ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్: వైష్ణవి చైతన్య

నోరా ఫతేహికి బిగ్ షాక్.. రూ.3 కోట్ల పరువు నష్టం దావా వేసిన ప్రముఖ సంస్థ!

బోయపాటి సెంటిమెంట్‌కు తమిళ బ్రదర్స్ నో?

త్రిషకు అండగా కంగనా.. ఉదయ్ నిధి స్టాలిన్ కు గట్టి కౌంటర్!

మరో మల్టీప్లెక్స్ ప్లానింగ్ లో రౌడీ హీరో..విస్తరిస్తున్న సినీ సామ్రాజ్యం!

ఢిల్లీ భవన ప్రమాదంపై సోనూసూద్ డిమాండ్!

కైపెక్కించే ఫోజులతో విష్ణుప్రియ కిర్రాక్ లుక్.. ఫోటోస్ వైరల్!

Big Stories

Advertisement
×