Dasari Kiran: సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న వారిలో దాసరి కిరణ్ (Dasari Kiran)ఒకరు. అయితే తాజాగా ఈయనని పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు (Vijayawada) తరలించారు. వ్యూహం(Vyuham) సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన దాసరి కిరణ్ ను ఈ సినిమాకు సంబంధించి ఆర్థిక లావాదేవీల విషయంలో విజయవాడ పటమట పోలీసులు హైదరాబాదులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. వ్యూహం సినిమాకు ప్రముఖ సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నిర్మాణంలో భాగంగా ఆర్థిక లావాదేవీలలో అవకతవకలు చోటు చేసుకున్న నేపథ్యంలోనే పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తోంది.