BigTV English

Pawan Kalyan: ఫ్యాన్స్ ను రెచ్చగొట్టిన పవన్ పై పోలీసులకు ఫిర్యాదు

Pawan Kalyan: ఫ్యాన్స్ ను రెచ్చగొట్టిన పవన్ పై పోలీసులకు ఫిర్యాదు

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చి కొత్త వివాదాలకు తెరలేపాడు. సినిమా మీటింగ్ లో కూడా రాజకీయాలు మాట్లాడి ప్రతిపక్ష నేతలకు ట్రోల్స్ చేయడానికి అవకాశం కల్పించాడు. పవన్ నటించిన హరిహర వీరమల్లు ఈ గురువారం రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కొందరు సినిమాబావుంది  అని చెప్తుండగా.. ఇంకొందరు అస్సలు ఏం సినిమారా బాబు అని తలలు పట్టుకున్నారు. విఎఫ్ఎక్స్ అయితే అస్సలు బాలేదని పెదవి విరిచారు. అయినా కూడా వీరమల్లు మంచి కలక్షన్స్ నే రాబడుతుంది. ఇప్పటివరకు వీరమల్లు రూ. 76 కోట్ల కలక్షన్స్ రాబట్టిందని, మరో రెండు రోజుల్లో వంద కోట్ల క్లబ్ లో కూడా చేరుతుందని ట్రేడ్ వర్గాల అంచనా.


 

ఇక ఇదంతా పక్కన పెడితే..  వీరమల్లు రిలీజ్ అయిన మొదటిరోజే సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ సక్సెస్ మీట్ లో కూడా పవన్ తన అభిమానుల గురించి , ట్రోల్స్ గురించి మాట్లాడాడు. ముఖ్యంగా ఈ సక్సెస్ మీట్ లోనే పవన్.. అభిమానులను రెచ్చగోట్టే విధంగా మాట్లాడినట్లు సోషల్ మీడియాలో పవన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రోల్స్ ను నేనెప్పుడూ పట్టించుకోనూ.. సోషల్ మీడియాలో అసలు దేనికి కొట్టుకుంటారో కూడా తెలియదు. నేనెప్పుడూ కుంగిపోను. నా అభిమానులైన మీరు కూడా అంత సున్నితంగా ఉండకండి. ధైర్యం ఉంటే తిరిగి కొట్టండి. నెగిటివ్ కామెంట్స్ చేస్తే.. మళ్లీ మీరు అలానే కామెంట్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు.


 

ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏది చేసినా.. ఎంత చేసినా  తమ హీరోల దృష్టిలో పడాలని చూస్తారు. అలాంటింది తమ అభిమాన హీరోనే.. మీకు నేనున్నా.. ఎక్కడా తగ్గకండి అని చెప్తే ఊరుకుంటారా.. ? దీనివలన  సోషల్ మీడియాలో వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు అవ్వదా.. ? ఒక హీరో అయ్యి ఉండి ఇలానేనా అభిమానులకు చెప్పేది. ఇంత రాక్షసంగా చేస్తారా.. ? అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. ఇండస్ట్రీలో మిగతా హీరోలందరూ.. గొడవలు వద్దు. మేము మేము బాగానే ఉంటాం.. మీరు బావుండాలి అని చెప్పిన హీరోలు ఉన్న ఇండస్ట్రీలో.. పవన్ మీకెందుకు దాడులకు పాల్పడండి అని రెచ్చగొడుతున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

ఇక తాజాగా పవన్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టి, దాడులకు ప్రేరేపిస్తున్నాడని కొందరు వైసీపీ నేతలు పవన్ పై ఫిర్యాదు చేశారు. సక్సెస్ మీట్ లో వైసీపీ నాయకులను పవన్ అవమానించాడని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పవన్ మాట్లాడాడని అని ఫిర్యాదులో  రాశారు.  పవన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక వీరితో పాటు నెటిజన్స్ కూడా పవన్ పై మండిపడుతున్నారు.  మరి ఈ వ్యాఖ్యలపై పవన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related News

Film industry: నోరు జారిన నిర్మాత..200 మంది కార్మికులతో ఆందోళన!

Raviteja : రూటు మార్చిన మాస్ మాహారాజ.. కన్నడ డైరెక్టర్ తో మూవీ..?

Swetha Menon : శ్వేత మీనన్ పై కేసు నమోదు.. ఏం జరిగిందంటే..?

War 2 Duration : సినిమా డ్యూరేషన్ మరీ అంత సేపా? ఎవరిని పరీక్షిస్తున్నారయ్యా..

Nani Paradise: ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో నాని పారడైజ్ ఫస్ట్ లుక్, ఈసారి ఏమి తగలబెడతాడో

Ntr -Hrithik: ఎన్టీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ పంపిన హృతిక్… అసలైన వార్ అప్పుడే అంటూ తారక్ రిప్లై!

Big Stories

×