Gut Health: మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన భాగాలలో జీర్ణ వ్యవస్థ కూడా ఒకటి. పేగులు సరిగా పనిచేస్తే, శరీరం పోషకాలను చక్కగా గ్రహిస్తుంది. ఫలితవంగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రస్తుత జీవనశైలిలో చాలామందికి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను అధిగమించి.. పేగులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన ఆహారం చాలా అవసరం. జీర్ణ వ్యవస్థకు మేలు చేసే కొన్ని అద్భుతమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. పీచు పదార్థాలు (Fibre): పీచు పదార్థాలు పేగు ఆరోగ్యానికి పునాది. ఇవి జీర్ణం కాకుండా పేగులలోకి వెళ్లి, అక్కడ ఉండే మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తాయి. దీనివల్ల మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు:
పండ్లు: ఆపిల్, బేరి, బెర్రీలు, అరటిపండు.
కూరగాయలు: బ్రోకలీ, క్యాలీఫ్లవర్, పాలకూర, బీట్‌రూట్, క్యారెట్.
ధాన్యాలు: ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా, హోల్ వీట్ బ్రెడ్.
పప్పులు: కందిపప్పు, పెసరపప్పు, శనగలు, రాజ్మా.
2. ప్రోబయోటిక్స్ (Probiotics): ప్రోబయోటిక్స్ అంటే మన పేగులలో ఉండే మంచి బ్యాక్టీరియా. ఇవి జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా.. చెడు బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటాయి. ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు:
పెరుగు/మజ్జిగ: ఇవి సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే ప్రోబయోటిక్ మూలాలు.
పులియబెట్టిన ఆహారాలు : కిమ్చి , సౌర్‌క్రాట్, టెంపే , కొంబుచా . ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
3. ప్రీబయోటిక్స్ (Prebiotics): ప్రీబయోటిక్స్ అనేవి మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేసే ప్రత్యేక రకాల పీచు పదార్థాలు. ఇవి ప్రోబయోటిక్స్ వృద్ధికి తోడ్పడతాయి. ప్రీబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు:
ఉల్లిపాయలు, వెల్లుల్లి, లీక్స్ .
ఆస్పరాగస్ , అరటిపండ్లు (ముఖ్యంగా పచ్చివి).
ఓట్స్, బార్లీ.
4. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (Omega-3 Fatty Acids): ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. పేగులలో మంట తగ్గితే, వాటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒమేగా-3 ఎక్కువగా ఉండే ఆహారాలు:
చేపలు: సాల్మన్, మాకెరెల్, సార్డిన్స్.
నట్స్, సీడ్స్: అవిసె గింజలు (Flaxseeds), చియా గింజలు (Chia seeds), వాల్‌నట్స్ (Walnuts).
Also Read: వాకింగ్ చేస్తే.. షుగర్ తగ్గుతుందా ?
5. నీరు: తగినంత నీరు తాగడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది, జీర్ణక్రియ కూడా సాఫీగా జరుగుతుంది. అందుకే రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర ఉన్న ఆహారాలు, అనారోగ్యకరమైన కొవ్వులు, అతిగా మాంసం తినడం పేగు ఆరోగ్యానికి హానికరం. అందుకే వాటిని తగ్గించుకోవడం మంచిది.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించడం ద్వారా పేగులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. మీ ఆహారంలో ఈ మార్పులు చేసే ముందు.. నిపుణులను సంప్రదించడం మంచిది.