Ilayaraja: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja)తాజాగా డ్యూడ్ సినిమా(Dude Movie) చిత్ర బృందానికి ఊహించని షాక్ ఇచ్చారు. ప్రదీప్ రంగనాథన్(Pradeep Raganathan) హీరోగా నటించిన డ్యూడ్ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని తెలుగు, తమిళ భాషలలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో “కరుతమచ్చన్”(Karutha Machan song) అంటూ సాగిపోయే పాట తనదేనని తాజాగా ఇళయరాజా ఈ విషయంపై కేసు నమోదు చేశారు. ఇలా తన అనుమతి లేకుండా ఈ పాటను ఉపయోగించిన నేపథ్యంలో సోనీ మ్యూజిక్ అలాగే డ్యూడ్ చిత్ర బృందం పై ఈయన అధికారకంగా కేసును వేసినట్టు తెలుస్తోంది.
ఇలా ఒక సినిమాకి సంబంధించిన పాటలు లేదా ఇతర విషయాలను వేరే సినిమాలో ఉపయోగిస్తే తప్పనిసరిగా అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అయితే ఇళయరాజా పాటను డ్యూడ్ చిత్ర బృందం తన అనుమతి లేకుండా ఉపయోగించారంటూ ఈయన కేసు వేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. మరి ఈ విషయంపై డ్యూడ్ చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇక డ్యూడ్ చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా తెలుగు తమిళ భాషలలో భారీగా కలెక్షన్లను కూడా రాబడుతోంది.
కీర్తిశ్వరన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, నేహా శెట్టి తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ప్రేమ కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ చిత్రం భారీ ఆదరణ రాబట్టింది. ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.95 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇదే జోరు కొనసాగిస్తే ఈజీగా 100 కోట్ల క్లబ్లో చేరుతుందని చెప్పాలి. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే..
గగన్ (ప్రదీప్ రంగనాథన్) లవ్ లో ఫెయిల్ అవుతాడు. కుందన (మమితా బైజు)పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్) కుమార్తె. కుందన గగన్ కి మరదలు అవుతుంది. ఇలా తన మరదలు తనని ప్రేమిస్తున్న విషయం తెలియడంతో గగన్ తన ప్రేమను రిజెక్ట్ చేస్తాడు. ఇలా తన ప్రేమను రిజెక్ట్ చేసిన తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో గగన్ కుందన పై ప్రేమను పెంచుకుంటారు. ఇలా కుందన పై ఉన్న తన అభిప్రాయాన్ని నేరుగా తన మామయ్య ఆదికేశవులకు చెప్పడంతో అందరూ సంతోషించి ఎంతో ఘనంగా ఇద్దరికీ పెళ్లి చేస్తారు. అయితే పెళ్లి తర్వాత కుందన గగన్ జీవితం ఎలా ఉంది? గగన్ ఎందుకు కుందన లవ్ రిజెక్ట్ చేశారు? పెళ్లి తర్వాత గగన్ ఎలాంటి త్యాగాలు చేశారు చివరికి ఈ సినిమా ఏమలుపు తిరిగింది అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
Also Read: Kantara1: బాహుబలిని ఢీ కొడుతున్న కాంతార చాప్టర్ 1… లెక్కలు మారేలా ఉన్నాయే ?