BigTV English

Naga vamsi: నాగ వంశీకి ఎందుకు అంత బిపి.. నిర్మాతపై మండిపడ్డ రివ్యూవర్

Naga vamsi: నాగ వంశీకి ఎందుకు అంత బిపి.. నిర్మాతపై మండిపడ్డ రివ్యూవర్

Naga vamsi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో నాగ వంశీ ఒకరు. ఈ మధ్యకాలంలో నాగ వంశీ విపరీతంగా పాపులర్ అయ్యారు. సితార ఎంటర్టైన్మెంట్ నుంచి ఒక సినిమా విడుదలవుతుంది అంటే ఆ సినిమాను ముందుండే నడిపిస్తారు వంశీ. అంతేకాకుండా ట్విట్టర్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ట్వీట్స్ కూడా వేస్తారు.


కొన్ని సినిమాల విషయంలో నాగ వంశీ చేసిన కామెంట్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. అవతార్ లాంటి సినిమాపై కూడా నాగ వంశీ తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యాడు. అప్పట్లో నాగ వంశీ చేసిన కామెంట్స్ కొద్దిపాటి సంచలనానికి తెరతీసాయి. అక్కడితో చాలామంది అతన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.

నాగ వంశీకి ఇష్యూ ఏంటి.?


ప్రస్తుత కాలంలో రివ్యూలు చెప్పేవాళ్లు ఎక్కువైపోయారు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మొబైల్ లో ఉన్న ప్రతి ఒక్కరు రివ్యూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రముఖ యూట్యూబర్ కూడా ప్రతి సినిమా గురించి రివ్యూ చెప్తూ ఉంటాడు. ఆ యూట్యూబర్ కింగ్డమ్ సినిమా గురించి కూడా రివ్యూ చెప్పారు. రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో ఈ సినిమాను పోలుస్తూ రివ్యూ చెప్పారు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి సినిమాతో దీన్ని ఎవరైనా పోలుస్తారా, ఇది గౌతం తిన్ననూరి కింగ్డమ్. ఆ సినిమాలో ఇది ఎందుకు ఉంటుంది.? అంటూ ఆ రివ్యూవర్ పై ఒక ఇంటర్వ్యూలో తన అసహనాన్ని వ్యక్తపరిచాడు నాగ వంశీ.

మండిపడ్డ రివ్యూవర్….

ఇక రివ్యూవర్ బహుశా ఆ ఇంటర్వ్యూ చూసినట్లు ఉన్నారు. నాగ వంశీ మీద మండిపడ్డాడు. నాగ వంశి కి ఎందుకు అంత బిపి తన సినిమాను కొద్దిపాటి నెగిటివ్ గా చెప్తే మండిపడిపోతున్నాడు. ఇదే నాగ వంశీ కొన్ని రోజుల క్రితం నాకు ఫోన్ చేసి వేరే ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన సినిమాకు నెగిటివ్ రివ్యూ చెప్తే అప్పుడు పొగిడాడు. రివ్యూ బాగా చెప్పారు అని మాట్లాడారు. ఇప్పుడు మాత్రం ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మొత్తం ఊగిపోతున్నాడు అంటూ ఆ రివ్యూవర్ తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలామంది నాగవంశీని మళ్లీ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

Also Read: HBD Kajol: పుట్టినరోజు స్పెషల్.. నటి కాజోల్ నికర ఆస్తులు.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×