E-Paper
Advertisement

HBD Kajol: పుట్టినరోజు స్పెషల్.. నటి కాజోల్ నికర ఆస్తులు.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

HBD Kajol: పుట్టినరోజు స్పెషల్.. నటి కాజోల్ నికర ఆస్తులు.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Advertisement

HBD Kajol: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మధ్య సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి కాజోల్(Kajol) ఒకరు. ఈమె గత మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలుగుతున్న ఇప్పటికి కూడా పలు సినిమాలలో, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న కాజోల్ నేడు 51వ పుట్టినరోజు (Birthday) వేడుకలను జరుపుకుంటున్నారు. ఇక ఈమె పుట్టినరోజు కావడంతో తనకు సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలను అభిమానులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈమెకు శుభాకాంక్షలు చేస్తున్నారు. ఇలా నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో కాజోల్ ఆస్తులు తన సినిమాలు కార్ల కలెక్షన్ కి సంబంధించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.

వందల కోట్ల ఆస్తులు…

Advertisement

దాదాపు 3 దశాబ్దాల క్రితం ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైన కాజోల్ బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సినిమాలలో కూడా నటించి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈమె ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇలా సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారని చెప్పాలి. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు సినిమాలలో సంపాదించింది మొత్తం రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతూ భారీగా ఆస్తులను కూడా పెట్టారు.

ఇంటి విలువ రూ.60 కోట్లు…

Advertisement

ఈ క్రమంలోనే కాజోల్ సైతం భారీ స్థాయిలో ఆస్తులను కలిగి ఉన్నారని తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. ఈమె సుమారు రూ.249 కోట్ల రూపాయల ఆస్తిపాస్తులను కలిగి ఉన్నారని తెలుస్తోంది. ఈమెకు ముంబైలో ఖరీదైన ప్రాంతంలో విలువైన ఆస్తిపాస్తులను కలిగి ఉన్నారని తెలుస్తోంది.
జుహులో శివశక్తి అనే విలాసవంతమైన బంగ్లాలో ఈమె నివసిస్తున్నారు. ఈ ఇంటి విలువ సుమారు 60 కోట్ల వరకు విలువ చేస్తుందని సమాచారం. ఈ ఇంటితో పాటు జుహు ప్రాంతంలో మరో రెండు విలువైన అపార్ట్మెంట్ లు ఉన్నాయని తెలుస్తుంది అలాగే లండన్ లో కూడా ఒక ఇల్లు ఉన్నట్టు సమాచారం.

హ్యాపీ బర్త్ డే నా ఫేవరెట్..

ఇలా విలువైన ఆస్తిపాస్తులను మాత్రమే కాకుండా తన గ్యారేజ్ లో ఖరీదైన కార్లు కూడా ఉన్నాయని చెప్పాలి.BMW X7, ఆడి Q7 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇలా హీరోయిన్ గా మాత్రమే కాకుండా వ్యాపార రంగంలోనూ సోషల్ మీడియా ద్వారా కూడా భారీ స్థాయిలో ఆస్తులను సంపాదించారు. ఇక ఈమె ప్రముఖ నటుడు అజయ్ దేవగన్(Ajay Devagan) ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ జంట ఇండస్ట్రీలో నిర్మాతలుగా మారి పలు సినిమాలను కూడా నిర్మించారు. ఇక నేడు ఈమె పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో తన భర్త అజయ్ దేవగన్ సోషల్ మీడియా వేదికగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. “నీకెన్నో చెప్పాలని ఉంది కానీ చెప్పిన నువ్వు నమ్మలేవు. అందుకే నా ఫేవరెట్ హ్యాపీ బర్త్డే అంటూ అజయ్ దేవగన్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ కూడా వైరల్ అవుతుంది.

Also Read: Hper Aadi: అదిరే అభి కాళ్లు కడిగి రుణం తీర్చుకున్న ఆది… గర్వంగా ఉందంటూ!

Related News

‘దాదా’గా విశ్వరూపం చూపించబోతున్న బాలయ్య.. విడుదల ఎప్పుడంటే?

అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న అక్కినేని హీరో… ఇప్పటీకి బాధగా ఉందంటూ!

సూరి, సుహాస్ ‘మండాడి’ ట్రైలర్ రిలీజ్!

ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటి పనులు చేస్తా – అక్కినేని సుమంత్

కళ్ళుచెదిరే రేంజ్ లో ‘వారణాసి’ తెలుగు థియేట్రికల్ బిజినెస్.. టాలీవుడ్ లోనే హైయెస్ట్!

సినిమా ఖర్చుల్లో బిగ్ స్కామ్?.. బోగస్ బిల్లులతో కోట్ల గోల్‌మాల్!

హ్యాపీ బర్తడే మోక్షజ్ఞ.. కొత్త మూవీ అనౌన్స్మెంట్ కి ఈ రోజైనా మోక్షం లభిస్తుందా?

తమిళ్ ఇండస్ట్రీలో మళ్లీ ‘మీటూ’ మంటలు.. బాంబు పేల్చిన సింగర్!

Big Stories

Advertisement
×