OTT Movie : ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు సీరియల్ కిల్లర్ వంటి అంశాలను జోడిస్తే… కథ మాములుగా ఉండదు. ఆద్యంతం ఎంగేజింగ్ గా ఉండే ఈ సరికొత్త జానర్ లో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఈ సిరీస్ పేరు ‘Beyond Evil’ (2021). ఈ దక్షిణ కొరియా థ్రిల్లర్ డ్రామా సిరీస్‌లో షిన్ హా-క్యూన్ (లీ డాంగ్-సిక్‌గా), యో జిన్-గూ (హాన్ జూ-వాన్‌గా), చోయ్ డే-హూన్ (పార్క్ జంగ్-జే), కిమ్ షిన్-రాక్ (ఓహ్ జి-హ్వా), చోయ్ సంగ్-యున్ (యూ జే-యి) ప్రధాన నటులుగా నటించారు, ఇతర సహాయక పాత్రలలో చోయ్ జిన్-హో, కిల్ హే-యున్ ఉన్నారు. ఈ సిరీస్ 16 ఎపిసోడ్‌లతో 2021లో తెరపైకి వచ్చింది. షిమ్ నా-యున్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో సీరియల్ కిల్లర్ కేసును ఛేదించే ఇద్దరు పోలీసుల ఉత్కంఠభరిత కథ, అద్భుతమైన నటన, టైట్ స్క్రిప్ట్, సూపర్ సినిమాటోగ్రఫీతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సిరీస్ 57వ బేక్సాంగ్ ఆర్ట్స్ అవార్డ్స్‌లో బెస్ట్ డ్రామా, బెస్ట్ స్క్రీన్‌ప్లే, షిన్ హా-క్యూన్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డులను గెలుచుకుంది.
కథలోకి వెళ్తే…
మున్మియో అనే చిన్న పట్టణంలో ఇద్దరు పోలీసుల మధ్య నడుస్తుంది స్టోరీ అంతా. 20 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సీరియల్ కిల్లింగ్ కేసు, ఇప్పటికీ పరిష్కారం కాని రహస్యంగా మిగిలిపోతుంది. ఈ కేసులో లీ డాంగ్-సిక్ (షిన్ హా-క్యూన్) అనే పోలీసు ఆఫీసర్ సోదరి అదృశ్యమవుతుంది. అయితే ఆ మిస్సింగ్ తరువాత ఆమె హత్యకు గురైనట్లు భావిస్తారు. ఈ ఘటన అతని జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
Read Also : ఛీఛీ ఇదేం సినిమారా బాబూ… డైరెక్టర్ ను జైలుకు కూడా పంపిన మూవీ… ఏ ఓటీటీలో ఉందంటే?
కొన్ని సంవత్సరాల తర్వాత హాన్ జూ-వాన్ (యో జిన్-గూ) అనే యంగ్ అండ్ టాలెంటెడ్ డిటెక్టివ్ మున్మియో పోలీస్ స్టేషన్‌కు బదిలీ అవుతాడు. జూ-వాన్ ఒక రిచ్ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. కానీ అతని రాకతో 20 ఏళ్ల నుంచి మిస్టరీగా ఉన్న పాత కేసు మళ్లీ తెరపైకి వస్తుంది. డాంగ్-సిక్, జూ-వాన్ ఇద్దరూ కలిసి ఈ సీరియల్ కిల్లింగ్స్ రహస్యాన్ని చేధించడానికి ప్రయత్నిస్తారు. కానీ స్టోరీ నడిచే కొద్దీ హాన్ కు లీ డాంగ్ పై అనుమానాలు మొదలవుతాయి. మరి డిటెక్టివ్ కు పోలీస్ పై అనుమానం రావడానికి గల కారణం ఏంటి? చివరికి ఈ కేసును సాల్వ్ చేయగలిగారా? ఆ మర్డర్స్ చేసిన సీరియల్ కిల్లర్ ఎవరు? పోలీస్ ఆఫీసర్ సోదరి నిజంగానే చనిపోయిందా? అనేది స్టోరీ.