E-Paper
Advertisement

HYDRAA Powers: జీహెచ్‌ఎంసీ పవర్స్‌కు ఇక బ్రేక్.. పవర్స్ అంతా హైడ్రాకే.. క్యూర్ బిల్లు అసలు ప్లాన్ ఇదే..?

HYDRAA Powers: జీహెచ్‌ఎంసీ పవర్స్‌కు ఇక బ్రేక్.. పవర్స్ అంతా హైడ్రాకే.. క్యూర్ బిల్లు అసలు ప్లాన్ ఇదే..?
Advertisement

HYDRAA Powers: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్‌ మహానగరంలో ఇప్పటికే ఆక్రమణల తొలగింపు, చెరువుల పరిరక్షణ చర్యలతో కీలక పాత్ర పోషిస్తున్న హైడ్రా క్యూర్ చట్టం అమల్లోకి వస్తే మరింత సూపర్ పవర్ గా మారేలా కొత్త చట్టంలోని నిబంధనలు చెబుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉన్న నాలాల పూడికతీత, వర్షాకాలం ఎమర్జెన్సీ టీమ్ లు, చెరువుల పరిరక్షణ, కొత్త భవనాలకు ఫైర్ సేఫ్టీ నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ల జారీ వంటి బాధ్యతలు ఇప్పటికే హైడ్రాకు బదలాయించిన సంగతి తెల్సిందే.

కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ-2026 బిల్లు..

ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ స్థాయిలో ఉన్న తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత హైడ్రాకు మరిన్ని అధికారాలు రానున్నాయి. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ-2026 బిల్లు అమల్లోకి వస్తే హైడ్రా పరిధి మరింత విస్తరించి, బాధ్యతలతో పాటు అధికారాలు కూడా పెరగనున్నాయి. అగ్నిమాపక భద్రత నుంచి నిర్మాణ వ్యర్థాల నియంత్రణ వరకు, విపత్తుల నిర్వహణ నుంచి చెరువుల సంరక్షణ వరకు అత్యంత కీలక బాధ్యతలను హైడ్రాకు అప్పగించాలని బిల్లులో సర్కారు ప్రతిపాదించింది. ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే హైడ్రా కార్యకలాపాలకు సమగ్ర చట్టం వచ్చినట్టవుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి.

హైడ్రాకు పవర్స్..

Advertisement

క్యూర్ బిల్లులో హైడ్రాకు ప్రత్యేక అధికారాలు కేటాయించారు. నగరంలోని భవనాలు, సంస్థల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలవుతున్నాయా లేదా అనే అంశాన్ని తనిఖీ చేసే అధీకృత సంస్థగా హైడ్రాను నియమించనున్నారు. అంటే భవనాలకు ఆక్యుపేన్సీ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలు అయ్యాయా? లేదా అనే ఎన్ఓసీని కూడా హైడ్రా నే జారీ చేయనుంది. అలాగే నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను అక్రమంగా తరలించడం, ఎక్కడపడితే అక్కడ డంపింగ్ చేయడాన్ని అరికట్టే బాధ్యత కూడా హైడ్రాకే దక్కనున్నట్లు బిల్లులో సర్కారు పత్రిపాదించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని కూడా బిల్లులో పొందుపర్చారు.

Also Read: Jaipur: త‌ల్లి ఉద్యోగం కోసం.. కూతురు ఏం చేసిందో తెలుసా? రంగంలోకి సుఫారీ గ్యాంగ్

కొత్త చట్టం కీలక హోదాలు..

Advertisement

ఇప్పటికే చెరువులు, నాలాలు కుంచించుకుపోవడానికి ప్రధాన కారణం నిర్మాణ వ్యర్ధాలే కావటంతో ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు చెరువుల పరిరక్షణ, నిర్మాణ వ్యర్ధాలను ఒక పద్దతిలో సేకరించి, రీ సైక్లింగ్ చేసే అంశాన్ని హైడ్రా పరిధిలోకి తీసుకువస్తే నిర్మాణ వ్యర్థాల నియంత్రణ విషయంలో మార్పు వస్తుందని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. అంతేగాక, హైడ్రా కమిషనర్‌కు కూడా ఈ కొత్త చట్టం కీలక హోదాలు కల్పించనుంది. నగరంలోని చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసే లేక్ ప్రొటెక్షన్ కమిటీకి చైర్మన్‌గా హైడ్రా కమిషనర్ వ్యవహరించనున్నారు.

అత్యంత కీలక పాత్ర..

ఇందులో మూడు కార్పొరేషన్ల ఉన్నతాధికారులు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై పూర్తి నియంత్రణ పవర్ కూడా హైడ్రా కమిషనర్ పరిధిలోకి రానున్నట్లు బిల్లులో ప్రతిపాదించారు. వరదలు, భారీ వర్షాలు, ఇతర విపత్తుల సమయంలో సమన్వయం చేసే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీకి కన్వీనర్‌గా హైడ్రా కమిషననే వ్యవహరించే బాధ్యతలు సమకూరనున్నాయి. ఇప్పటికే విపత్తుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమైన మ్యాన్ పవర్, మిషనరీ, సామాగ్రిని సమకూర్చుకున్న హైడ్రా చెరువుల సంరక్షణ, విపత్తుల నిర్వహణలో అత్యంత కీలక పాత్ర కానుంది. ఇంతటితో ఆగని సర్కారు అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని అధికారాలను కేవలం ఒక్క గవర్నమెంట్ ఆర్డర్ జారీ చేసి హైడ్రాకు అప్పగించే వెసులుబాటును క్యూర్ బిల్లులో కల్పించారు.

Also read: Village Development: తెలంగాణ పల్లెల్లో సరికొత్త ప్రగతి శకం.. ప్రతి నెలకు 1,000 పని దినాలుండేలా సర్కార్ బిగ్ ప్లాన్!

Related News

నిజామాబాద్ జిల్లాలో దారుణం.. భార్య చేతిలో భర్త దారుణ హత్య!

VLR Dairy: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కల్తీ పెరుగు దందాపై అధికారులు ఉక్కుపాదం.. కోర్టు సంచలన తీర్పు!

BRAOU Bed Notification 2026: విద్యార్థులకు అలర్ట్.. అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ.. బీఈడీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

Student Suicide: రూ.10 వేల కోసం హస్టల్ వార్డెన్ టార్చర్.. భరించలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్!

రూ.37 వేల కోట్లు ఇచ్చాం.. మరి ధాన్యం ఏవి? తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన కిషన్ రెడ్డి!

Village Development: తెలంగాణ పల్లెల్లో సరికొత్త ప్రగతి శకం.. ప్రతి నెలకు 1,000 పని దినాలుండేలా సర్కార్ బిగ్ ప్లాన్!

దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసు అధికారి.. ఆ ఉచ్చులో చిక్కుకున్నాడు, కళ్లు చెదిరేలా రూ.300 కోట్ల ఆస్తులు

Big Stories

Advertisement
×