BigTV English

Fauzi: పుట్టుకతో అతను ఒక యోధుడు.. అదిరిపోయిన ఫౌజీ లుక్

Fauzi: పుట్టుకతో అతను ఒక యోధుడు.. అదిరిపోయిన ఫౌజీ లుక్
Advertisement

Fauzi: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని ప్రభాస్ ఫ్యాన్స్ పాడుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడెప్పుడు ప్రభాస్ – హను రాఘవపూడి సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తారా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ ఆశ నెరవేరింది. నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఎట్టకేలకు ప్రభాస్- హను టైటిల్ ను అధికారికంగా రిలీజ్ చేశారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఫౌజీ అనే టైటిల్ తో బాగా ఫేమస్ అయ్యింది.  ఇక అందరూ అనుకుంటున్నట్లే అదే టైటిల్ ను మేకర్స్ ప్రకటించారు.


గత రెండు రోజుల నుంచి ఫౌజీ సినిమా నుంచి అప్డేట్స్ ఇస్తూ హైప్ పెంచారు. ఇక ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేస్తూ అధికారికంగా చెప్పుకొచ్చారు. సంస్కృతలో పద్మవ్యూహం విజేత, పార్థ, పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు. గురువు లేని ఏకలవ్యుడు.. మరియు పుట్టుకతో అతను ఒక యోధుడు అని రాసుకొచ్చారు. ఇక ఈ శ్లోకంలోనే ప్రభాస్ క్యారెక్టర్ ను చెప్పేశారు.

అంతేకాకుండా డార్లింగ్ కు బర్త్ డే విషెస్ చెప్తూ ఆయనతో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని డైరెక్టర్ హను రాఘవపూడి తెలిపాడు. “మా ప్రియమైన ప్రభాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.  మిమ్మల్ని ఫౌజీ గా పరిచయం చేయడం చాలా గర్వంగా ఉంది. ఇప్పటివరకు ఈ ప్రయాణం మరపురానిది. ఇక్కడి నుంచి మరింత పెద్దదిగా ఉంటుందని హామీ ఇస్తున్నాను. ఫౌజీ మన చరిత్రలో దాచిన అధ్యాయాలలో ఉన్న ఒక సైనికుడి ధైర్యవంతమైన కథ” అంటూ చెప్పుకొచ్చారు. 


ఇక పోస్టర్ లో ప్రభాస్ లుక్ చాలా బావుంది. ఒంటరిగా పోరాడే బెటాలియన్ అంటూ నడిచి వచ్చే సైన్యం అన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్  జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు సిద్దమవుతుంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి  రికార్డులు బద్దలుకొడతాడో చూడాలి.

Related News

Renu Desai: నా పిల్లలను వదిలేసి.. సన్యాసం తీసుకుంటున్నా.. కానీ,

Upasana Konidela: అఫీషియల్… రెండో వారసుడు రాబోతున్నట్లు ప్రకటించిన మెగా కోడలు

SKN: బండ్లన్న అలా చేస్తే ఇండస్ట్రీకి ప్రమాదం… నిర్మాత SKN షాకింగ్ కామెంట్!

Bandla Ganesh: జోష్ మూవీ కోసం సిద్ధూ ఆరాటం.. కట్ చేస్తే నెక్స్ట్ రవితేజ!

Samantha: నా విడాకులు వారికి సంబరాలు.. సమంత షాకింగ్ కామెంట్స్!

HBD Prabhas: 46 ఏళ్లు.. ఇప్పటికైనా శుభవార్త చెప్పవయ్యా!

Prabhas : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. రెబల్ స్టార్ టు పాన్ ఇండియా స్టార్..ఆస్తుల విలువ ఎంత..?

Big Stories

×