రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్స్, కదులుతున్న రైళ్లతో పాటు రైల్వే పరిసరాల్లోనూ సోషల్ మీడియా కోసం రీల్స్, వీడియోలు తీయకూడదని రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. అయినా, చాలా మంది పద్దతి మార్చుకోవడం లేదు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకునే క్రమంలో ప్రాణాలే కోల్పోతున్నారు. తాజాగా ఒడిషాలో ఓ యువకుడు రైల్వే ట్రాక్ మీద నిలబడి ఇన్ స్టా రీల్ చేస్తుండగా, రైలు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మైనరు బాలుడు స్పాట్ లోనే చనిపోయాడు. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.
మంగళవారం నాడు ఒడిశాలోని పూరి జిల్లాలోని జనకదేపూర్ రైల్వే స్టేషన్ లో ఇన్ స్టాగ్రామ్ రీల్ షూట్ చేస్తుండగా, వేగంగా వచ్చిన రైలు ఢీకొని ఒక మైనర్ బాలుడు మరణించాడు. మంగళ ఘాట్ నివాసి అయిన ఆ బాలుడు తన తల్లితో కలిసి దక్షిణకాళి ఆలయానికి దర్శనం కోసం వెళ్ళాడు. వారు ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఆ అబ్బాయి తన మొబైల్ ఫోన్ లో చిన్న వీడియో రికార్డ్ చేయడానికి రైల్వే పట్టాలకు దగ్గరగా ప్రమాదకరంగా నిలబడి ఉండగా, వేగంగా వచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది. రైలు బలంగా తగలడంతో బాలుడు ఎగిరిపడ్డాడు. స్పాట్ లోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అతడిని రైలు ఢీకొనే విజువల్స్ తన ఫోన్ లో రికార్డు అయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది, స్థానికుల ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహాన్ని వెలికితీసి, పోస్ట్ మార్టం కోసం మీపంలోని ఆసుపత్రికి పంపారు. జరిగి ఘటనపై ఆరా తీశారు. యువకుడి సెల్ ఫోన్ ను పరిశీలించారు. ప్రమాదం జరిగినప్పుడు రికార్డు అయిన విజువల్స్ ను చూశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Tragic accident occurred in Puri district, #Odisha A 15-year-old boy was hit by train & died near #Janakdeipur railway station. The accident occurred while he was filming a video reel on his mobile phone on the railway track.#Reels#reelsvideo pic.twitter.com/XB613GdZX0
— Nikita Sareen (@NikitaS_Live) October 23, 2025
అటు ఈ ఘటనపై పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. రైల్వే లైన్ల దగ్గర భద్రతా హెచ్చరికలను పట్టించుకోకుండా సోషల్ మీడియా వీడియో కోసం బాలుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడని తెలిపారు. రీల్ షూట్ చేస్తున్నప్పుడు రైలు వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు యువకుడి నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. యువత ఎట్టి పరిస్థితుల్లోనూ రైల్వే పరిసరాల్లో రీల్స్ చేయడం, ఫోటోలు దిగడం చేయకూడదంటున్నారు. ప్రాణాలు పోవడం ఖాయం అంటున్నారు. ఒకవేళ రీల్స్ చేస్తూ ఎవరైనా దొరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Read Also: వద్దని చెప్పినా వినకుండా.. 9 నెలల పాపతో మంచు పర్వతమెక్కిన జంట, చివరికి..