Bengaluru Crime: వారంతా ఐదుగురు వ్యక్తులు. ఆ ఇంట్లోవారిపై ఎప్పటి నుంచి కన్నేశారో తెలీదు. తలుపు కొట్టి ఇంట్లోకి జొరబడ్డారు. తొలుత ఇంటి మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ ఇంటిని దోచేశారు. దారుణమైన ఈ ఘటన బెంగళూరు రూరల్ ప్రాంతంలో వెలుగుచూసింది. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
బెంగుళూరులో దారుణం..
రాజధాని బెంగళూరు సిటీలోని రూరల్ జిల్లా గంగొండనహళ్లిలో ఈ దారుణం జరిగింది. మంగళవారం రాత్రి దాదాపు 9 గంటలు దాటిన తర్వాత ఓ ఇంటి తలుపు తట్టారు ఐదుగురు వ్యక్తులు. అయితే లోపలున్నవారు తలుపు తీయగానే వారంతా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంట్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలు సహా ఆరుగురు సభ్యులు ఉన్నారు. తొలుత ఓ మహిళను గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు ఐదుగురు వ్యక్తులు.
ఆ తర్వాత ఇంటిని దోపిడీ చేశారు. దాదాపు 25 వేల నగదు దోచుకెళ్లారు. అంతేకాదు రెండు మొబైల్ ఫోన్లను సైతం పట్టుకుపోయారు. ఘటన జరిగిన రోజు బాధిత కుటుంబ సభ్యుడు మిడ్‌నైట్‌లో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసు అధికారులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. బాధితుల కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. బాధితురాలు బెంగాల్‌కు చెందిన వ్యక్తి.
మహిళలపై గ్యాంప్ రేప్, ఆ తర్వాత దోపిడీ
కొంతకాలంగా ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటన తర్వాత మీడియాతో మాట్లాడారు పోలీసులు. ఇంట్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉంటున్నట్లు తెలిపారు. నిందితులు లైంగిక దాడికి పాల్పడడమేకాకుండా మొబైల్ ఫోన్లు, నగదును దోచుకెళ్లారని తెలిపారు. ఘటన జరిగిన రోజు అర్థరాత్రి సమయంలో బాధితురాలి కొడుకు పోలీసులకు సమాచారం ఇచ్చాడని తెలిపారు.
ALSO READ: చెరువులోకి దూకేముందు ఏం జరిగిందంటే.. తుని సీఐ చెప్పిన నిజాలు
నిందితులు కూడా ఈ ప్రాంతానికి చెందినవారని తేలింది. ప్రస్తుతానికి బాధితురాలు ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ ఘటన తర్వాత సీసీటీవీ కెమెరాల ఆధారంగా ముగ్గురు నిందితులను కార్తీక్, గ్లెన్, సుయోగ్ లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేస్తున్నారు. సామూహిక అత్యాచారం, దోపిడీ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఘటన సమయంలో నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులు-బాధితురాలికి ఇంతకుముందు పరిచయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.