BigTV English

Bandla Ganesh: జోష్ మూవీ కోసం సిద్ధూ ఆరాటం.. కట్ చేస్తే నెక్స్ట్ రవితేజ!

Bandla Ganesh: జోష్ మూవీ కోసం సిద్ధూ ఆరాటం.. కట్ చేస్తే నెక్స్ట్ రవితేజ!
Advertisement

Bandla Ganesh:సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో ఈయన కూడా ఒకరు..సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో హీరో అవకాశాల కోసం ఆరాటపడ్డారు. ఆ తర్వాత డీజే టిల్లు మూవీ ఈయన కెరియర్ ను మార్చేసింది.. ఆ తర్వాత వెంటనే వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ కూడా సిద్ధూ జొన్నలగడ్డ పేరుని ఇండస్ట్రీ మొత్తం తెలిసేలా చేసింది. అయితే అలాంటి ఈ హీరో జాక్ మూవీతో బొక్క బోర్లా పడ్డాడు. తాజాగా వచ్చిన తెలుసు కదా మూవీ కూడా పెద్దగా ఆకట్టుకున్నట్టు అనిపించడం లేదు.


తెలుసుకదా సక్సెస్ మీట్ లో బండ్లన్న..

కానీ మేకర్స్ మాత్రం తెలుసు కదా మూవీకి తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ కి బండ్ల గణేష్ (Bandla Ganesh) ని చీఫ్ గెస్ట్ గా పిలిచారు. ఇక రీసెంట్ గా బండ్ల గణేష్ ఇచ్చిన దివాళి పార్టీలో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) కనిపించిన సంగతి తెలిసిందే. అలా తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ కి బండ్ల గణేష్ ని ముఖ్య అతిథిగా పిలిచారు. ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ ఇలాంటి ఈవెంట్లకు వెళ్లి తనదైన స్టైల్ లో మాట్లాడుతూ వైరల్ అవుతున్నారు.

ఆ స్టార్ హీరోకి సిద్ధూ ఆల్టర్నేట్..

ఈ నేపథ్యంలోనే తాజాగా బండ్ల గణేష్ తెలుసు కదా సక్సెస్ సెలబ్రేషన్స్ లో సిద్ధూ జొన్నలగడ్డ గురించి మాట్లాడుతూ.. “సిద్ధూ జొన్నలగడ్డ జోష్ మూవీలో ఓ చిన్న పాత్ర పోషించారు. ఆ సినిమాలో చేసినప్పుడు ఆయనకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. ముందు వెనక ఎవరూ లేరు. అయినా కూడా అందులో ఆ చిన్న రోల్ రావడం కోసం ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు సిద్ధూ జొన్నలగడ్డ రేంజ్ వేరే.. డీజే టిల్లు సినిమా చూసి ఇదంతా వన్ డే వండర్ మాత్రమే అనుకున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో ఉండే డైలాగ్ లు ఒక్క సినిమాతోనే పోతాయి అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుసు కదా మూవీ చూశాక గొప్ప నటుడివి అవుతావని అర్థమవుతుంది. ఇండస్ట్రీలో నీలాంటి యంగ్ హీరోలు ఉండడం చాలా మంచి విషయం. మీలాంటి యంగ్ హీరోలు ఉన్నంతకాలం ఇండస్ట్రీ సేఫ్ హాండ్స్ లో ఉంటుందని నేను భావిస్తా.. కచ్చితంగా చెబుతున్నాను నువ్వు రవితేజకు ఆల్టర్నేటివ్ అవుతావు.. నువ్వు కచ్చితంగా రవితేజ అంతటి వాడివి అవుతావు” అంటూ పొగిడారు.


ALSO READ:Samantha: నా విడాకులు వారికి సంబరాలు.. సమంత షాకింగ్ కామెంట్స్!

బండ్లన్న కామెంట్స్ నిజమవ్వాలి..

ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారడంతో చాలామంది బండ్లన్న మాట్లాడిన మాటల్ని సపోర్ట్ చేస్తున్నారు. యంగ్ హీరోలకు మీలాంటి ప్రోత్సాహం ఇచ్చే వాళ్ళు వెనక నుండి ఒక్కరైనా ఉండాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సిద్ధూ జొన్నలగడ్డ బండ్ల గణేష్ చెప్పినట్టు రవితేజ అంతటి వాడు అవుతాడు.. ఆయన స్టైల్,ఆయన మేనరిజం,డైలాగ్ డెలివరీ..ఇలా ప్రతి ఒక్కటి రవితేజను తలపించేలా ఉంటాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు… మరి చూడాలి సిద్దు జొన్నలగడ్డ తన కెరీర్ ని ఇలాగే సక్సెస్ బాటలో తీసుకువెళ్తారా..ముందు ముందు ఆయన కెరియర్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఇక సిద్దు జొన్నలగడ్డ అప్కమింగ్ సినిమాల విషయానికి వస్తే.. రవికాంత్ పేరు ఎప్పుడు డైరెక్షన్లో బ్యాడాస్ అనే మూవీ చేస్తున్నారు..

Related News

Renu Desai: నా పిల్లలను వదిలేసి.. సన్యాసం తీసుకుంటున్నా.. కానీ,

Upasana Konidela: అఫీషియల్… రెండో వారసుడు రాబోతున్నట్లు ప్రకటించిన మెగా కోడలు

SKN: బండ్లన్న అలా చేస్తే ఇండస్ట్రీకి ప్రమాదం… నిర్మాత SKN షాకింగ్ కామెంట్!

Fauzi: పుట్టుకతో అతను ఒక యోధుడు.. అదిరిపోయిన ఫౌజీ లుక్

Samantha: నా విడాకులు వారికి సంబరాలు.. సమంత షాకింగ్ కామెంట్స్!

HBD Prabhas: 46 ఏళ్లు.. ఇప్పటికైనా శుభవార్త చెప్పవయ్యా!

Prabhas : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. రెబల్ స్టార్ టు పాన్ ఇండియా స్టార్..ఆస్తుల విలువ ఎంత..?

Big Stories

×