BigTV English

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Mohammed Siraj : భారత క్రికెట్ కి ఇప్పుడు నవశకం ప్రారంభమైంది అనే చెప్పాలి. ముఖ్యంగా ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్టుల సిరీస్ లో యువ కెప్టెన్ శుబ్ మన్ గిల్ నాయకత్వంలో టీమిండియా 2-2 తో సిరీస్ ను డ్రా చేసుకొని చరిత్ర సృష్టించింది. ఓవల్ లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించిన తరువాత గిల్ ను ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. ఈ సందర్భంగా అతనికి ఒక పతకంతో పాటు ప్రత్యేక బహుమతిగా రెండు వైన్ బాటిళ్లు లభించాయి. అయితే టీమిండియా కెప్టెన్ శుబ్ మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకుంటే.. టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. కానీ ఇతను ప్రత్యేక బహుమతిగా వైన్ బాటిల్ ను తీసుకోలేదు. ప్రత్యేక బహుమతిని స్వీకరించడానికి నిరాకరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


Also Read : Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

షాంపైన్ బాటిల్.. నిరాకరించిన సిరాజ్ 


టీమిండియా బౌలర్ సిరాజ్ ప్రత్యేకంగా వైన్ బాటిల్ ఇస్తే.. అసలు ఎందుకు తీసుకోలేదు. ఒకవేళ అతను మద్యం సేవించకపోతే ఆ బాటిల్ తీసుకొని తన తోటి క్రికెటర్లకు అయినా ఇవ్వొచ్చు కదా.. ఇలా ఎందుకు చేశాడని సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చించుకోవడం విశేషం. ఈసీబీ బహుమతిగా ఇచ్చిన షాంపైన్ బాటిల్ ను స్వీకరించేందుకు మహ్మద్ సిరాజ్ నిరాకరించాడు. సిరాజ్ ముస్లిం భక్తుడు కాబట్టి షాంపైన్ బాటిల్ ని స్వీకరించలేదని తెలుస్తోంది. వాస్తవానికి ఇస్లాంలో మద్యం సేవించడం సాధారణంగా నిషేదించబడింది. ఖురాన్, ప్రవక్త, ఇస్లామిక్ న్యాయ శాస్త్రం ప్రకారం.. ముస్లింలు మద్యం సేవించరని తెలుస్తోంది. అందుకే సిరాజ్ ప్రత్యేక బహుమతిని తీసుకోలేదని స్పష్టంగా అర్థమవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

సిరాజ్ అద్భుత ప్రదర్శన 

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి మనస్సులను గెలుచుకున్నాడు. 5 టెస్టుల్లో 23 వికెట్లు పడగొట్టి అత్యంత విజయవంతమైన బౌలర్ గా నిలిచాడు. సిరాజ్ వికెట్లు తీయడమే కాకుండా.. వరుసగా 5 టెస్ట్ మ్యాచ్ లు ఆడి.. 1113 బంతులు బౌలింగ్ చేశాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా ఆడిన బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది సిరాజ్ అనే చెప్పాలి. జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్లు తీయగలిగాడు. సిరాజ్ ఆటతీరు జట్టు విజయానికి కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సిరాజ్ ఇప్పటి వరకు తన టెస్ట్ కెరీర్ లో 22 టెస్టులు గెలిచి 24 మ్యాచ్ ల్లో ఓడిపోయాడు. మిగిలిన 5 టెస్ట్ మ్యాచ్ లు డ్రా అయ్యాయి. టీమిండియా గెలిచిన మ్యాచ్ ల్లో మాత్రం సిరాజ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. జట్టు గెలిచిన 22 మ్యాచ్ ల్లో సిరాజ్ 76 వికెట్లు తీయడం విశేషం. సిరాజ్ 24 మ్యాచ్ ల్లో ఓడిపోయిన ఆ మ్యాచ్ ల్లో కేవలం 32 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ముఖ్యంగా ఓవల్ వేదికగా జరిగిన 5వ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను 6 పరుగుల తేడాతో ఓడించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×