BigTV English
Advertisement

Prabhas: ప్రభాస్ కాలికి ఏమైంది.. ఆ సమస్యతో బాధపడుతున్నాడా.. టెన్షన్ లో ఫ్యాన్స్!

Prabhas: ప్రభాస్ కాలికి ఏమైంది.. ఆ సమస్యతో బాధపడుతున్నాడా.. టెన్షన్ లో ఫ్యాన్స్!

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. పలు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉంటూనే మరోవైపు బాహుబలి ది ఎపిక్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ రానా అనుష్క ప్రధాన పాత్రలలో నటించిన బాహుబలి సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తిరిగి మరోసారి ఈ రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా విడుదల చేయబోతున్నారు.


ప్రభాస్ కాలికి ఏమైంది..

అక్టోబర్ 31వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అక్టోబర్ 30న ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. అలాగే ఇప్పటికే ఓవర్సీస్ ప్రీమియర్లు ప్రసారం అవ్వడమే కాకుండా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి ప్రభాస్ రానా ముగ్గురు ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో భాగంగా ప్రభాస్ కాలు మొత్తం వాచిపోయి ఉండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రభాస్ ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ కాలికి సర్జరీ..

ప్రభాస్ బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురి కావడంతో ఆయన కాలికి దెబ్బ తగిలిందని పలు సందర్భాలలో కాలికి సర్జరీ కూడా చేయించుకున్నారని ఆయన టీం వెల్లడించారు. ఇలా విదేశాలలో పలు కాలికి సర్జరీ చేయించుకున్నప్పటికీ ఆయనకి ఇంకా నయం కాలేదా ? అదే గాయమే ఇప్పటికి బాధ పెడుతుందా? అందుకే తన కాలు మొత్తం అలా వాచిపోయిందా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. సర్జరీ కారణంగా కాలు వాపు వచ్చిందా లేకపోతే ఇతర అనారోగ్య సమస్యలతో ప్రభాస్ బాధపడుతున్నారా అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.


వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా..

ప్రభాస్ ఆరోగ్యానికి సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఈయన మారుతి డైరెక్షన్ లో ది రాజా సాబ్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది. ఇక ఈ సినిమాని సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా పనులలో కూడా బిజీగా ఉన్నారు. ఈ సినిమా దాదాపు 60% షూటింగ్ పూర్తి అయిందని తెలుస్తోంది. ఈ సినిమాని కూడా 2026 ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ కల్కి సక్వెల్ సినిమాలను కూడా చేయబోతున్నారు. అలాగే సందీప్ రెడ్డివంగా డైరెక్షన్లో స్పిరిట్ సినిమా షూటింగ్ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

Also Read: Rishabh shetty: కాంతార 1 ఎఫెక్ట్.. మరో తెలుగు సినిమాకు రిషబ్ గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే?

Related News

Bison: U-18 మహిళల కబడ్డీ జట్టుకు మారి సెల్వ రాజ్ విరాళం, ఇది కదా అసలైన వ్యక్తిత్వం

Baahubali The Epic : బాహుబలి రీ రిలీజ్, మెగాస్టార్ చిరంజీవి పై ట్రోలింగ్

Baahubali : జై మాహిష్మతి అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపిన జక్కన్న, ఇది మరో చరిత్ర

Bahubali: బాహుబలి రీ రిలీజ్ అరాచకం, మాస్ జాతరకు ఇది పెద్ద దెబ్బే

Mahesh Babu: బాహుబలి పనులలో రాజమౌళి.. ఫ్యామిలీతో చిల్ అవుతున్న మహేష్!

The Girl Friend: ది గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ ఛాయిస్ రష్మిక కాదా.. ఆమె రిజెక్ట్ చేస్తేనే ?

Lokesh Kanagaraj: లోకేష్ కి హీరోయిన్ దొరికేసిందోచ్.. రచ్చ రాంబోలే!

Big Stories

×