Rishabh shetty: రిషబ్ శెట్టి(Rishabh Shetty) కన్నడ దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ అనంతరం నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. రిషబ్ స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార(Kantara) సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. కాంతార సినిమాకు రిషబ్ ఏకంగా నేషనల్ అవార్డు (National Award)అందుకున్నారు ఇప్పుడు కాంతార చాప్టర్ 1 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇలా కాంతార సినిమాల ద్వారా రిషబ్ పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది.
ఈ సినిమా ద్వారా నటుడిగా ఈయన మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఇతర భాష సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో జై హనుమాన్(Jai Hanuman) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈయన ఆంజనేయ స్వామి పాత్రలో కనిపించబోతున్నారు. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ (Prashanth Varma)దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలోనే ఈ సినిమా జనవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాతో పాటు రిషబ్ శెట్టి మరొక సినిమాకి కూడా కమిట్ అయ్యారని తెలుస్తుంది .
ఆకాశవాణి ఫేమ్ డైరెక్టర్ అశ్విన్ గంగరాజు (Aswin Gangaraju)దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో రిషబ్ హీరోగా నటించబోతున్నారు. ఇక ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమా పీరియాడిక్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన వెల్లడించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా పూర్తి అయ్యాయని అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది.
కాంతార యూనివర్స్..
ఒకవైపు కన్నడ సినిమాలతో పాటు రిషబ్ తెలుగు సినిమాలకు కూడా కమిట్ అవుతూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే ఈయన హనుమాన్ సినిమా షూటింగ్ తో పాటు అశ్విన్ గంగరాజు సినిమా పనులలో కూడా బిజీగా ఉండబోతున్నారు. ఈ సినిమాలతో పాటు రిషబ్ కాంతార సీక్వెల్ పనులను కూడా ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. కాంతార యూనివర్స్ నుంచి మరి కొన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు రిషబ్ వెల్లడించారు. కాంతార సినిమాలను నిజజీవిత సంఘటనలు ఆధారంగా కన్నడ సంస్కృతి సాంప్రదాయాలను తెలియపరుస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Bollywood Ramayan : రాముడి పాత్రలో రణబీర్… సద్గురు రియాక్షన్ ఇదే