Tejaswi Madivada:తేజస్వి మదివాడ (Tejaswi Madivada).. ఏ విషయాన్ని అయినా సరే నిర్మొహమాటంగా చెప్పగలిగే అతి కొద్ది మంది నటీమణులలో ఈమె కూడా ఒకరు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బోల్డ్ కామెంట్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు కూడా ఈమె చేసిన కామెంట్లు ఈమెను మళ్లీ వార్తల్లో నిలిచేలా చేశాయని చెప్పవచ్చు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్వి.. బఠానీలు అమ్మినట్లు శృం*గా*రాన్ని అమ్ముతున్నారు అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు తేజస్వి ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేసింది? ఎవరిని ఉద్దేశించి కామెంట్స్ చేసింది? అసలేం జరుగుతోంది ?అంటూ నెటిజన్స్ కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తేజస్వి మాట్లాడుతూ..” నేను ఒక సినిమా కోసం మొదటిసారి బ్యాంకాక్ వెళ్లాను. అయితే అక్కడ వీధుల్లో అందరూ శృంగారం కోసమే నిల్చున్నారు. బఠానీలు అమ్మినట్లు అక్కడ శృంగారం అమ్ముతున్నారు. అప్పటివరకు హైదరాబాదులో పెరిగిన నేను.. ఈ విషయాన్ని ఇక్కడ చాలా సీక్రెట్ గా మాట్లాడడం చూశాను. కానీ అక్కడ మాత్రం అంతా ఓపెన్ గానే” అంటూ తేజస్వి చెప్పుకొచ్చింది . ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏదేమైనా బ్యాంకాక్ లో అసలు బంధం, బంధుత్వాలకు ఆ ప్రాంతంలో విలువ లేదు అని.. అందరూ దాని కోసమే ఆరాటపడతారు అంటూ డైరెక్ట్ గానే కామెంట్లు చేసింది. ప్రస్తుతం తేజస్వి చేసిన కామెంట్లపై నెటిజన్స్ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Bomb Blast Warning: మామ అల్లుళ్ళకు బాంబు బెదిరింపులు.. తమిళనాట ఏం జరుగుతోంది?
తేజస్వి మదివాడ కెరీర్ విషయానికి వస్తే.. మొదట చదువుకునే సమయంలోనే సెవెన్ అప్, డాబర్ గులాబరి వంటి వ్యాపార ప్రకటనల్లో చేసింది. ఆ తర్వాత వెంకటేష్ , మహేష్ బాబు కాంబోలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఈ సినిమా తర్వాత తేజస్వి మదివాడకి వరుస అవకాశాలు వచ్చాయి. అలా ఐస్ క్రీమ్,హార్ట్ ఎటాక్,లవర్స్,మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కేరింత, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పండగ చేస్కో, శ్రీమంతుడు, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, కమిట్మెంట్, హైడ్ అండ్ సీక్ వంటి సినిమాలు చేసింది.
అలాగే ఆ మధ్యకాలంలో తెలుగు బుల్లితెర రియాల్టీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 2 లోకి కంటెస్టెంట్ గా వెళ్లి మరింత గుర్తింపు సంపాదించింది. ఈ హీరోయిన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఐస్ క్రీమ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అలా ప్రస్తుతం పలు సినిమాల్లో బోల్డ్ రోల్స్ లో నటించడమే కాకుండా కొన్ని టాక్ షోలకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తుంది.