Mass Jathara Vs Baahubali: హీరో రవితేజ నటిస్తున్న అవుట్ అండ్ యాక్షన్ మూవీ ‘మాస్ జాతర‘ . నవంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ని నిన్న విడుదల చేశారు మేకర్స్. కానీ, మాస్ మహారాజా సినిమా అంటే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ మాస్ జాతర విషయంలో యాక్టివ్గా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో ఆ సందడే కనిపించడం లేదు. మూవీ టీం కూడా పెద్దగా యాక్టివ్గా లేదు. ఇక సోషల్ మీడియాలో పెద్దగా సందడి కనిపించడం లేదు. ట్రైలర్ తర్వాత సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తేలిపోయింది. దీంతో మాస్ జాతర విషయంలో ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయిపోయారేమో అనిపిస్తుంది. మూవీ రిలీజ్కి ఇంకా కొన్ని రోజులే ఉంది. కానీ, ఎక్కడ మూవీ బజ్ కనిపించడం లేదు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే అసలు ఈ మూవీ రిలీజ్ ఉందనే విషయమైన ఆడియన్స్‌కి రీచ్ అయ్యిందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఓ వైపు నిర్మాత నాగవంశీ మాత్రం సినిమాపై ఓ రేంజ్లో హైప్ ఇచ్చాడు. ఇంటర్వెల్ సీన్ నెక్ట్స్ లెవెల్ అంటూ మాస్ జాతరపై బజ్ పెంచాడు. కానీ, ట్రైలర్ అవేవి కనిపించలేదు. పైగా ఇప్పుడు మాస్ జాతరకు పోటీగా బాహుబలి రీ రిలీజ్ ఉంది. ఈ మూవీపై మాత్రం ఆడియన్స్ భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం.. రెండు భాగాలను కలిపి బాహుబలి: ది ఎపిక్ పేరుతో చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి ఎంత పెద్ద చిత్రమో తెలిసింది. మూవీ రిలీజ్ లో కూడా వంద కోట్లు గ్యారంటీ అని మూవీ టీం ధీమా వ్యక్తం చేస్తుంది. మూవీకి ఉన్న బజ్ చూస్తుంటే కూడా వందకోట్లు ఏంటి రూ. 200 కోట్లు దాటిన ఆశ్చర్యం లేదంటున్నారు.
ఇలాంటి టైంలో బాహుబలి లాంటి పెద్ద సినిమాకు ఎదురువెళ్లడమంటే సాహసమే అని చెప్పాలి. ముఖ్యంగా మాస్ జాతరతో వెళ్లడమంటే నిర్మాత నాగవంశీ రిస్క్ చేస్తున్నట్టే. రీ రిలీజ్ మూవీకి కూడా ఈ రేంజ్ లో బజ్ ఉంది. కానీ, మాస్ జాతర కనీసం ఒపెనింగ్స్ అయిన పడతాయా? అని సందేహిస్తున్నారు. ఇలాంటి టైంలో మూవీని రిలీజ్ చేయడం కంటే వాయిదా వేసుకోవడమే మంచిదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ప్రేక్షకులు మాస్ జాతర కంటే కూడా బాహుబలిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చూసిన సినిమా, మొన్నటి వరకు ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నోసార్లు ఈ మూవీని చూసి ఉంటారు. కానీ, రెండు భాగాలు కలిపి ఎడిట్ చేసి ఒక్క సినిమా ప్రేక్షకులకు అందిస్తున్నారు.
మూడు మూడు గంటలు ఉన్న ఈ రెండు భాగాలను కట్ చేసి సుమారు 4 గంటలకు కుదించారు. అయితే ఇందులో కొన్ని ఎడిటెడ్ సీన్స్ కూడా యాడ్ చేసినట్టు తెలుస్తోంది. ఏ సీన్స్ తీసేసి, ఏవి యాడ్ చేశారనేది ప్రేక్షకుల్లో ఆసక్తి సంతరించుకుంది. దీంతో ఆరు గంటలపైగా ఉన్న చిత్రాన్ని నాలుగు గంటల్లోనే ఎలా చూపిస్తారనే అంశం ఆసక్తిగా పెంచుతుంది. దీంతో బాహుబలి: ది ఎపిక్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చూస్తుంటే ఈ కొత్త సినిమా.. రీ రిలీజ్ చిత్రం ముందు నిలవడం కష్టమే అంటున్నారు. మరి ఇలాంటి టైంలో మాస్ జాతరను విడుదల చేయకుండ మూవీ టీం కాస్తా ఆలోచిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. పైగా పైగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉన్నాయి. ఇప్పుడు మాస్ జాతరకు వర్షాల ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. అసలే హైప్ లేని ఈ సినిమాకు బాహుబలి ఎఫెక్ట్ తో పాటు వర్షాల ప్రభావం కూడా భారీగానే పడే అవకాశాలు ఉన్నాయి.