Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దమ్మపేట గ్రామానికి చెందిన నల్లపోతుల మహేష్ తన ఇంటి ముందు టాటా పంచ్ కారును నిలిపాడు. అయితే కారు ఇంజన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడం గమనించాడు. వెంటనే నీటితో మంటలను ఆరిపే ప్రయత్నం చేయగా క్షణాల్లో మంటలు కారు మెుత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి వచ్చే లోపు కారు మెుత్తం అగ్నికి ఆహుతయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు గా తెలుస్తోంది.