The Raja Saab: ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం బాహుబలి సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉన్న సినిమాను ప్రభాస్ చేయలేదు. ఈ సినిమాలో ప్రభాస్ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చూస్తాం అని ఇదివరకే రిలీజ్ అయిన టీజర్ వలన అర్థమైంది.
ఈ సినిమా మొదలుపెట్టకు ముందు మారుతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ తో సినిమా చేస్తే డార్లింగ్, బుజ్జిగాడు వంటి ఎంటర్టైన్మెంట్ సినిమాను చేస్తాను అంటూ తెలిపాడు. ప్రస్తుతం అదే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
డిసెంబర్ లో రిలీజ్ కష్టమా.?
ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆ డేట్ కి ఈ సినిమా వచ్చేటట్లు కనిపించడం లేదు. మాక్సిమం ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని గురించి ఇంకా అధికారక ప్రకటన రాలేదు. చిత్ర యూనిట్ మాత్రం అనౌన్స్ చేసిన డేట్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి సంజయ్ దత్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ విడుదలైన వెంటనే అందరినీ ఆకట్టుకున్న అంశం ప్రభాస్ బ్యూటీ. ప్రభాస్ ని అంత అందంగా చూసి చాలా రోజులైంది. రెండు రోజుల క్రితం సెట్స్ నుంచి విడుదలైన ఫొటోస్ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి.
సంక్రాంతి బరిలో
ప్రభాస్ రాజా సాబ్ సినిమా సంక్రాంతి కానుక ఎప్పుడో విడుదల చేస్తానని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా సంక్రాంతి టైంలోనే వచ్చింది. తెలుగు సినిమా కనెక్షన్లు సంక్రాంతి సీజన్ లో ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. సినిమాకి మామూలు టాక్ వస్తే చాలు ఆడియన్స్ విపరీతంగా సినిమాను చూస్తారు. ఒక సినిమా బాగుంది అని టాక్ వచ్చింది అంటే రిజల్ట్ ఎలా ఉండబోతుందో అనే దానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా మంచి ఎగ్జాంపుల్. పోటీలో ఎన్నో పెద్ద సినిమాలు ఉన్నా కూడా ఆ సినిమా అన్నిటినీ మించి అద్భుతంగా ఆడింది.
Also Read: Actress Aamani : ఫ్యామిలీ మెంబర్స్ ముందు అలా చేయమన్నారు,సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్