The Paradise: ‘ది ప్యారడైజ్’.. నాని రీసెంట్‌గా నటించిన సినిమా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ లభించింది. కొన్ని వర్గాలు ఈ సినిమా బాగుంది అంటుంటే, కొన్ని వర్గాలు మాత్రం అస్సలు బాగోలేదు, పూర్తి వైలెన్స్.. అసలు సినిమాకి వెళ్లనే వెళ్లకండి అంటూ సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. సినిమా రివ్యూ కూడా నెగిటివ్‌గానే వచ్చింది. కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులుపుతున్నాయి. నాని పర్ఫామెన్స్ మాత్రం హైలెట్‌గా ఉంది అంటూ నాని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ది ప్యారడైజ్ సినిమాలో హీరో నానికి తల్లిగా నటించిన పాత్ర మాత్రం హైలెట్‌గా మారింది. సినిమాకి సంబంధించి ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నా, సమ్మక్క పాత్రలో నటించిన సోనాలి కులకర్ణి నటనకు మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. సోనాలి కులకర్ణి నటనకు వందకి వంద మార్కులు వేస్తున్నారు అభిమానులు. ఆ గంభీరం, ఆ అమాయకత్వం, ఆ హుందాతనం పర్ఫెక్ట్‌గా క్యారెక్టర్‌కి సూట్ అయింది అంటూ పొగిడేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా ఈమె గురించి, ఈమె బ్యాక్ గ్రౌండ్ గురించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఎవరీ సమ్మక్క అంటూ తెగ గూగుల్ సెర్చ్ చేసేస్తున్నారు.
ఆమె సినీ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఆరా తీస్తున్నారు. ఆమె 1992లో సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 2000లో వచ్చిన “మిషన్ కాశ్మీర్” మూవీలో 26 ఏళ్లకే హృతిక్ రోషన్ తల్లిగా నటించి శభాష్ అనిపించుకున్నారు. ఆ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. అంటే ఆమె ఎంత టాలెంటెడ్ అనేది అందరూ అర్థం చేసుకోవచ్చు.
ఇక ఆ తర్వాత అమ్మ పాత్రలతో పాటు హీరోయిన్‌గానూ చేశారు. అలాంటి పాత్రలే చేయాలి, ఇలాంటి పాత్రలే చేయాలి అని కాదు.. తనకు, తన మనసుకు ఏ పాత్ర నచ్చితే ఆ పాత్రలో లీనమైపోయి నటిస్తుంది. అందుకే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇక 2013లో ఆమె నటించిన “ది గుడ్ రోడ్” సినిమా 86వ ఆస్కార్ అవార్డులకు సైతం ఎంపికైంది.
also read: రిషబ్ శెట్టి కొత్త మూవీలో నటించాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి!
నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ ఇందులో నాని తల్లిగా నటించిన సమ్మక్క పాత్రకు మాత్రం పూర్తి మార్కులే పడ్డాయి. మరి ఈ సమ్మక్క పాత్రతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సోనాలి కులకర్ణికి తదుపరి అవకాశం మళ్లీ తెలుగులో లభిస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.