E-Paper
Advertisement

గోంధళ్‌కు ఆస్కార్ ఎంట్రీ.. అనురాగ్ కామెంట్స్‌తో కొత్త ట్విస్ట్

గోంధళ్‌కు ఆస్కార్ ఎంట్రీ.. అనురాగ్ కామెంట్స్‌తో కొత్త ట్విస్ట్
Advertisement

Gondhal Oscar:‘గోంధళ్’ ..మరాఠీ బాషలో చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఇపుడు మొత్తం నేషనల్ వైడ్ గా మారు మ్రోగిపోతుంది.కారణం 99వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ తరఫున మొత్తం 33 సినిమాలు పోటీలో ఉండగా ‘గోంధళ్’సెలెక్ట్ కావడమే .అయితే ఇపుడు ఇదే సెలెక్షన్ పై బాలీవుడ్ మల్టీ టాలెంట్ అనురాగ్ కశ్యప్ చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మంచి సినిమాలు పంపలేకపోయాం 

Advertisement

అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ భారత్ నుంచి ఆస్కార్‌కు సినిమాలు పంపించే విషయంలో మనం చాలాసార్లు తప్పులు చేశామని చెప్పుకొచ్చాడు. గతంలో ‘ది లంచ్‌బాక్స్’, ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ లాంటి సినిమాలకు మంచి ఛాన్స్ ఉన్నా.. వాటిని ఆస్కార్‌కు పంపించలేకపోయామని తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.

సెలెక్షన్ లో రాజకీయాలు ఉండటం,ఇక ఏంటి ,ఎందుకు సెలక్ట్ చేస్తున్నాం అన్న విషయాలపై ఎవరికీ సరైన అవగాహన లేకపోవడం లాంటి విషయాలు కూడా ప్రభావం చూపుతున్నాయని ఆయన కామెంట్ చేయడం ఇపుడు సోషల్ మీడియాలో చర్చకి కారణం అవుతుంది.

Advertisement

ఇక ‘గోంధళ్’ గురించి మాట్లాడుతూ సినిమా ఆస్కార్ రేసులో ముందుకు వెళ్లాలంటే కేవలం భారత్ నుంచి ఎంట్రీ రావడం సరిపోదని.. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సినిమాను ఎక్కువగా ప్రదర్శించాలని, విదేశీ ప్రేక్షకులకు సినిమా చేరాలని అన్నారు. ముఖ్యంగా అమెరికాలో మంచి డిస్ట్రిబ్యూషన్, ప్రమోషన్ ఉంటే ఆస్కార్ క్యాంపెయిన్‌కు ఉపయోగపడుతుందని తనదైన సలహాలని ఇచ్చాడు.

అనురాగ్ కశ్యప్ ‘గోంధళ్’ సినిమా చూడలేదట

ఇక ఈ సినిమాని తాను ఇప్పటివరకు ఈ సినిమా చూడలేదని , అందుకే సినిమా ఎలా ఉంది? ఆస్కార్‌లో ఎంత దూరం వెళ్తుంది? అనే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని స్పష్టం చేశాడు. దీంతో ఆయన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో అప్పుడే డిబేట్లు మొదలయ్యాయి కూడా .

ఇక ఈ కామెంట్స్‌పై ‘గోంధళ్’ దర్శకుడు సంతోష్ దావాఖర్ రియాక్ట్ అవుతూ అనురాగ్ కశ్యప్ అంటే తనకు చాలా గౌరవం ఉందని చెప్పిన దావాఖర్.. ముందుగా సినిమా చూసి, ఆ తర్వాత అభిప్రాయం చెప్పాలని కోరారు.

సినిమా చూసి మాట్లాడితే బాగుంటుంది

గతంలో బెంగళూరు నుంచి ముంబైకి విమానంలో వెళ్తున్న సమయంలో అనురాగ్ కశ్యప్‌ను కలిశానని దావాఖర్ చెప్పారు. అప్పుడే తన సినిమా ‘గోంధళ్’ గురించి ఆయనకు చెప్పానని.. సినిమా చూస్తానని కశ్యప్ కూడా చెప్పారని గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు సినిమా చూడలేదని తెలిసి.. ముందుగా సినిమా చూసి మాట్లాడితే బాగుంటుందని ఆయన కోరారు.

‘గోంధళ్’ సినిమా విషయానికి వస్తే మహారాష్ట్రలో సంప్రదాయంగా జరిగే ‘గోంధళ్’ అనే భక్తి నృత్యం, సంగీతం, ఆచారాల చుట్టూ కథ నడుస్తుంది. గ్రామీణ మహారాష్ట్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందింది. కథలో మనుషుల నమ్మకాలు, కోరికలు, సంబంధాలు, మానసిక సంఘర్షణల నేపధ్యంలో చాలా థ్రిల్లింగ్ గా తెరకెక్కించాడు డైరెక్టర్ సంతోష్ దావాఖర్.

also read :ఐబొమ్మ రవికి సగం రిలీఫ్.. అసలు ట్విస్ట్ రూ.3 కోట్ల దగ్గరే!

చూడాలి మరి భారీ అంచనాలతో ఆస్కార్ బాట పడుతున్న ఈ ‘గోంధళ్’ ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !

Tags

Related News

నాని కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్.. ‘ది ప్యారడైజ్’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే?

అంజలికి ఏమైంది? ఒక్కసారిగా ఇలా మారిపోయిందే!

మరోసారి కోయంబత్తూర్ ఆసుపత్రికి రామ్ చరణ్… గాయం ఇంకా తగ్గలేదా?

నేను ఎంతో అదృష్టవంతుడిని.. రష్మిక పోస్టుపై విజయ్ క్యూట్ రిప్లై!

ఐబొమ్మ రవికి సగం రిలీఫ్.. అసలు ట్విస్ట్ రూ.3 కోట్ల దగ్గరే!

రూ.100 కోట్ల డీల్.. దిల్ రాజు మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడా?

కింగ్ ఖాన్ కి భారీ షాక్.. రూ.2490 కోట్లు గోవిందా!

Big Stories

Advertisement
×