Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఇలా ఈయన చేతికి గాయం అయినప్పటికీ షూటింగ్ పనులు అన్నింటిని పూర్తి చేసే సినిమాని విడుదల చేశారు .అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత రామ్ చరణ్ కోయంబత్తూర్ (coimbatore)లోని గంగ హాస్పిటల్ లో తన చేతికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే .ఇన్ని రోజులు చేతికట్టుతో రామ్ చరణ్ కనిపించారు అయితే తాజాగా మరోసారి ఈయన కోయంబత్తూర్ హాస్పిటల్ కి వెళ్ళారని తెలుస్తోంది.
ఇలా రామ్ చరణ్ తిరిగే కోయంబత్తూర్ హాస్పిటల్ కి వెళ్లడంతో అసలు ఎందుకు వెళ్లారు? ఆయన చేతి గాయం ఇంకా మానలేదా? అంటూ అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే రామ్ చరణ్(Ram Charan) కోయంబత్తూర్ హాస్పిటల్ కి వెళ్లి తన చేతిలో సర్జరీ సమయంలో అమర్చిన మెటల్ రాడ్ ను తీసేయించుకున్నారని తెలుస్తోంది. చిన్న సర్జరీ ద్వారా చేతిలో ఉన్న మెటల్ రాడ్ తొలగించారు. ఇలా రాడ్ తొలగించినప్పటికీ చేతి మణికట్టు ముందులాగా పనిచేయాలి అంటే 8 నుంచి 10 వారాలపాటు ఫిజియోథెరపీ చేయించుకోవాలని అలాగే విశ్రాంతి కూడా తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తుంది.
ఈ విధంగా రామ్ చరణ్ తిరిగి మరోసారి చిన్న సర్జరీ చేయించుకోవడంతో ఈయన దాదాపు రెండు నెలలపాటు ఎలాంటి పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో సుకుమార్ డైరెక్షన్లో చరణ్ చేయబోయే సినిమా మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా రామ్ చరణ్ చేతి సర్జరీ కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది అయితే ఇప్పుడు మరొక రెండు నెలలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించడంతో ఈ సినిమా మరింత ఆలస్యం అవుతుందని చెప్పాలి.
?stkn=ZmFzZjUwejNoenpp
దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పూజా కార్యక్రమాలు జరిగినప్పటికీ రాంచరణ్ కష్టతరమైన సన్నివేశాలలో పాల్గొనరని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి పూర్తి వివరాలను మరి కొద్ది రోజులలో అధికారికంగా ప్రకటించనున్నారు. రామ్ చరణ్ సుకుమార్(Sukumar) కాంబినేషన్లో సినిమా అంటేనే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో రంగస్థలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది .తిరిగి మరోసారి ఈ కాంబో సెట్ అవ్వడంతో ఈసారి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. పుష్ప సినిమాతో సుకుమార్ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. పుష్ప 2 తర్వాత సుకుమార్ చరణ్ తో సినిమా చేయబోతున్న నేపథ్యంలో అభిమానులు ఈ సినిమాపై బోలెడు అంచనాలు పెట్టుకున్నారు.
Also Read: నేను ఎంతో అదృష్టవంతుడిని.. రష్మిక పోస్టుపై విజయ్ క్యూట్ రిప్లై!