E-Paper
Advertisement

అంజలికి ఏమైంది? ఒక్కసారిగా ఇలా మారిపోయిందే!

అంజలికి ఏమైంది? ఒక్కసారిగా ఇలా మారిపోయిందే!
Advertisement

Anjali :అంజలి…సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీతమ్మ గా తెలుగు ప్రజల మనసుల్ని దోచుకున్న ఈ ముద్దుగుమ్మ కాస్తా ఇపుడు బొద్దుగుమ్మగా మారిపోయింది. ఇక తాజాగా ఒక సినిమా ప్రమోషన్స్ లో ఊహించని విధంగా బొద్దుగా కనిపించడంతో ఇపుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ ఫోటోలే దర్శనం ఇస్తున్నాయి.

అంజలి 2006లో ‘ఫోటో’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెల్సిందే.అయితే నందూ హీరోగా వచ్చిన ఈ సినిమా బోల్తా కొట్టడంతో అవకాశాలు కరువైపోయాయి.ఇక అదే సమయంలో చెన్నైకి వెళ్లి తమిళ సినిమాలపై ఫోకస్ పెట్టింది. అక్కడ అంజలి నటనకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. అలా తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

ఇక అలా అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ భామకి వెంకటేశ్, మహేశ్ బాబు కలిసి నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఈ సినిమాలో వెంకటేశ్‌కు జోడీగా ‘సీత’ పాత్రలో కనిపించే అవకాశం దొరికింది. ఆ సినిమా హిట్ కావడంతో అంజలికి తెలుగులో కూడా ఆఫర్లు క్యూ కట్టాయి.

అలా ‘బలుపు’, ‘మసాలా’, ‘గీతాంజలి’, ‘శంకరాభరణం’, ‘డిక్టేటర్’, ‘చిత్రాంగద’, ‘వకీల్ సాబ్’ ఇలా వరుస సినిమాల్లో నటించి మెప్పించడమే కాకుండా స్పెషల్ సాంగ్స్‌లో కూడా సందడి చేసింది. ముఖ్యంగా ‘గీతాంజలి’ లాంటి సినిమాలతో మంచి పేరు కూడా తెచ్చుకుంది.ఇక ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’,‘బహిష్కరణ’ లాంటి సినిమాల్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలతో ఆడియన్స్ కి పెద్ద షాకే ఇచ్చింది. అయితే భారీ అంచనాలతో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ మాత్రం బోల్తా కొట్టడంతో కాస్త జోరు తగ్గించింది.

Advertisement

అయితే తెలుగులో కాస్త స్లో అయినా మళ్లీ తమిళ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ‘ఏడు కాదల్ ఏడు మలై’, ‘ఈగై’ వంటి సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ మలయాళంలో కూడా ఓ సినిమా చేయడం విశేషం. రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏడు కాదల్ ఏడు మలై’లో నివిన్ పౌలి, సూరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచానాలు ఉన్నాయి.

సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కేరళలో జరిగిన ఓ ఈవెంట్‌కు అంజలి హాజరయ్యారు. అక్కడ ఆమె కనిపించిన లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో కంటే కాస్త బొద్దుగా కనిపించడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

also read :గోంధళ్‌కు ఆస్కార్ ఎంట్రీ.. అనురాగ్ కామెంట్స్‌తో కొత్త ట్విస్ట్

అయితే కాస్త బరువు పెరిగినప్పటికీ ఫిట్‌గానే కనిపించడం విశేషం.ఇక . స్టైలిష్ డ్రెస్‌లో అంజలి ఇచ్చిన పోజులు, ఆమె కాన్ఫిడెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చూడాలి మరి తెలుగు కాకుండా పరభాషా సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ మళ్ళీ తెలుగులో ఎప్పుడు సినిమా చేస్తుందో !

Tags

Related News

మరోసారి కోయంబత్తూర్ ఆసుపత్రికి రామ్ చరణ్… గాయం ఇంకా తగ్గలేదా?

గోంధళ్‌కు ఆస్కార్ ఎంట్రీ.. అనురాగ్ కామెంట్స్‌తో కొత్త ట్విస్ట్

నేను ఎంతో అదృష్టవంతుడిని.. రష్మిక పోస్టుపై విజయ్ క్యూట్ రిప్లై!

ఐబొమ్మ రవికి సగం రిలీఫ్.. అసలు ట్విస్ట్ రూ.3 కోట్ల దగ్గరే!

రూ.100 కోట్ల డీల్.. దిల్ రాజు మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడా?

కింగ్ ఖాన్ కి భారీ షాక్.. రూ.2490 కోట్లు గోవిందా!

గణపతి పండగే.. కాని రాత్రి 11కి డీజేలు ఏంటి బాబోయ్! రేణు దేశాయ్ ఫైర్

Big Stories

Advertisement
×