Rishabh Shetty: సినిమా ఇండస్ట్రీ కొత్త నటీనటులకు, టాలెంట్ ఉన్న వాళ్లకు ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పలు నిర్మాణ సంస్థలు కూడా కొత్త వాళ్లతో మంచి కంటెంట్ బేస్డ్ చిత్రాలు చేస్తూ భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇకపోతే ఇప్పుడు మరో పాన్ ఇండియా స్టార్ తమ సినిమాలో నటించే సువర్ణ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ మేరకు కొత్త నటీనటుల నుండి కొత్త సినిమా కోసం దరఖాస్తులు కోరుతూ ఓపెన్ కాస్టింగ్ కాల్ ప్రకటించారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
రిషబ్ శెట్టి.. డైరెక్టర్గా, హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.. అలాంటి ఈయన తాజాగా సామాన్యులకు శుభవార్త చెబుతూ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ఎక్స్ వేదికగా తనకు చెందిన ‘రిషబ్ శెట్టి ఫిలిమ్స్’ సంస్థ తమ కొత్త సినిమా కోసం కొత్త నటీనటుల నుండి దరఖాస్తులు కోరుతూ ఓపెన్ కాస్టింగ్ కాల్ ప్రకటించింది.
ఈ మేరకు.. “సినిమా రంగంలో మీ ప్రయాణం ఇక్కడే మొదలవవచ్చు. ఒక కొత్త కథ రూపుదిద్దుకుంటుంది. రిషబ్ శెట్టి ఫిలిమ్స్ వారి ఈ ఉత్సాహభరితమైన కొత్త ప్రాజెక్టులో భాగమవడానికి మేము కొత్త ప్రతిభావంతుల కోసం ఎదురుచూస్తున్నాం. మీలో ఆ సామర్థ్యం ఉందని మీరు భావిస్తే.. సినిమా ప్రపంచంలో అడుగుపెట్టడానికి ఇదొక గొప్ప సువర్ణ అవకాశం కావచ్చు.. రండి ఈ ప్రయాణంలో మాతో చేతులు కలపండి” అంటూ ఒక కీలక నోట్ షేర్ చేశారు రిషబ్ శెట్టి.
ఇకపోతే 2026 అక్టోబర్ 2వ తేదీన బెంగళూరు వేదికగా విజయ కాలేజీలో ఆడిషన్ జరగనున్నట్లు తెలిపారు.
అలాగే వయసు పరిమితి పురుషులకు 20 నుండి 65 సంవత్సరాలు, మహిళలకు 20 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అలాంటివారు ఈ ఆడిషన్ లో పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ రెజ్యూమ్, ప్రొఫైల్ , వర్క్ లింక్స్ ను rrrfilmz@gmail.com ఈమెయిల్ ఐడి కి పంపవచ్చు. అలాగే అధికారిక సోషల్ మీడియా అప్డేట్స్ కోసం రిషబ్ శెట్టి ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా చూడవచ్చు అంటూ స్పష్టం చేశారు. మొత్తానికైతే రిషబ్ శెట్టి సినిమాలో ఎవరైతే భాగం కావాలని కోరుకుంటున్నారు. మీకు ఆ టాలెంట్ ఉంటే కచ్చితంగా ఈ ఆడిషన్లో పాల్గొనండి అంటూ రిషబ్ తెలిపారు. మరి చూద్దాం రిషబ్ శెట్టి కొత్త సినిమాలో ఎవరికి ఆ అదృష్టం వరించనుందో.
ನಮ್ಮನ್ ನೋಡ್ಲಿಕ್ಕೆ ನೀವ್ ಬಂದಿದಿರಿ
ನಿಮ್ಮನ್ ನೋಡ್ಲಿಕ್ಕೆ ನಾವ್ ಬರ್ತಿದ್ದೇವೆ.
ರಿಷಬ್ ಶೆಟ್ಟಿ ಫಿಲಂಸ್ ಕಡೆಯಿಂದ ಪ್ರತಿಭಾವಂತರಿಗೆ ಸುವರ್ಣ ಅವಕಾಶ.Your journey into cinema could begin here. 🎬
A new story is taking shape, and we’re looking for fresh talent to be a part of this exciting new project… pic.twitter.com/VA6rSdJP27
— Rishab Shetty (@shetty_rishab) September 24, 2026