E-Paper
Advertisement

నాని కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్.. ‘ది ప్యారడైజ్’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే?

నాని కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్.. ‘ది ప్యారడైజ్’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే?
Advertisement

Paradise Collections:‘ది ప్యారడైజ్’…మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూసిన ఈ సినిమా ఎట్టకేలకి థియేటర్ లోకి వచ్చేసింది. బుధవారం పెయిడ్ ప్రీమియర్స్‌తో సందడి చేసిన ఈ సినిమా అఫీషియల్ గా ఆడియన్స్ ముందుకి వచ్చేసింది.మరి మొదటి రోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత కొల్లగొట్టిందో, సోషల్ మీడియా ఈ కలెక్షన్స్ పై ఏం తెల్చేసిందో ఒకసారి చూసేద్దాం.

మొదటి రోజు ఇండియాలో రూ.35 కోట్ల నెట్

Advertisement

ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ది ప్యారడైజ్’ మొదటి రోజు ఇండియాలో రూ.35 కోట్ల నెట్ కలెక్షన్ రాబట్టినట్టు సమాచారం. ముఖ్యంగా తెలుగు వెర్షన్ కి ఆడియన్స్ కోట్ల రూపాయలు కుమ్మరించగా , నార్త్ బెల్ట్ కూడా వసూల్లని గట్టిగానే అందించింది.అయితే తమిళంలో మాత్రం కలెక్షన్లు తక్కువగా నమోదైనట్టు టాక్ వినిపిస్తుంది.

లెక్కలన్నింటినీ తుడిచి పెట్టేసింది

Advertisement

ఇక ఈ ఓపెనింగ్‌తో నాని గత సినిమాల రికార్డులు కూడా బద్దలు అయినట్టు తెలుస్తుంది. 2025లో వచ్చిన ‘HIT: The Third Case’ మొదటి రోజు రూ.22 కోట్ల నెట్ రాబట్టగా అంతకుముందు ‘దసరా’ రూ.24 కోట్ల నెట్‌ రాబట్టి  నాని కెరీర్‌లో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. ఇక ‘సరిపోదా శనివారం’ రూ.10 కోట్ల నెట్, ‘హాయ్ నాన్న’ రూ.5 కోట్ల నెట్‌తో డీసెంట్ ఓపెనింగ్స్ నే రాబట్టాయి.మొత్తానికి భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ ప్యారడైజ్ రూ.35 కోట్లతో  ‘ది ప్యారడైజ్’ ఈ లెక్కలన్నింటినీ తుడిచి పెట్టేసింది.

సవారీ తెగ చుట్టూ సినిమా

కథ విషయానికి వస్తే.. ‘ప్యారడైజ్’ అనే కల్పిత ప్రాంతంలో నివసించే సవారీ తెగ చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. ప్రభుత్వ గుర్తింపు కోసం పోరాడే ఈ తెగ, మరోవైపు తమను దోపిడీ చేసే ఫ్యూడల్ వ్యవస్థ నుంచి బయటపడేందుకు చేసే పోరాటమే సినిమాకు ప్రధాన కథ .ఈ సినిమాలో నానితో పాటు మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, కాయదు లోహర్, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెల్సిందే.

ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ఎక్కడికి చేరుతుందో !

అయితే బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇలా ఉంటె సినిమా అనుకున్నంత లేదంటూ భారీ మొత్తంలో డివైడ్ టాక్ స్ప్రెడ్ అవడం గమనార్హం. చూస్తుంటే ఈ టాక్ సినిమాపై గట్టి దెబ్బ కొట్టేలానే ఉంది. అయితే ఇప్పటికీ సినిమాపై మెజారిటీ ఆడియన్స్ లో అంచనాలు ఉండటం కారణంగా శుక్రవారం, శనివారం, ఆదివారం కలెక్షన్లు భారీ ఉంటాయని భావిస్తున్నారు.చూడాలి మరి రూ.35 కోట్ల మొదటి రోజు నెట్‌తో మొదలైన ఈ ప్రయాణం ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ఎక్కడికి చేరుతుందో !

Tags

Related News

అంజలికి ఏమైంది? ఒక్కసారిగా ఇలా మారిపోయిందే!

మరోసారి కోయంబత్తూర్ ఆసుపత్రికి రామ్ చరణ్… గాయం ఇంకా తగ్గలేదా?

గోంధళ్‌కు ఆస్కార్ ఎంట్రీ.. అనురాగ్ కామెంట్స్‌తో కొత్త ట్విస్ట్

నేను ఎంతో అదృష్టవంతుడిని.. రష్మిక పోస్టుపై విజయ్ క్యూట్ రిప్లై!

ఐబొమ్మ రవికి సగం రిలీఫ్.. అసలు ట్విస్ట్ రూ.3 కోట్ల దగ్గరే!

రూ.100 కోట్ల డీల్.. దిల్ రాజు మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడా?

కింగ్ ఖాన్ కి భారీ షాక్.. రూ.2490 కోట్లు గోవిందా!

Big Stories

Advertisement
×