Dimple hayathi:జీవితంలో పైకి ఎదగాలంటే కష్టం ఒకటే సరిపోదు. దేవుడి దయ కూడా ఉండాలి అని ఎంతోమంది చెబుతూ ఉంటారు. అందులో భాగంగానే మరీ ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు.. ఆయా రంగాలలో అభివృద్ధి చూడడం కోసం పలు దేవాలయాలకు వెళ్లి మరీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కొంతమంది కోరిక కోరుతూ పూజలు నిర్వహిస్తే.. మరికొంతమంది ఆ కోరికలు నెరవేరిన తర్వాత మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ కనిపించింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆ తరువాత గోవులకు గ్రాసం తినిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇక శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో డింపుల్ హయతి కనిపించడంతో పెళ్లి కోసం ప్రత్యేక పూజలు చేయించారా ? లేక కెరియర్లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ప్రత్యేక పూజలు నిర్వహించారా ? అని కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.. ఏది ఏమైనా అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని, ఆమె కెరియర్ లో మంచి అవకాశాలు అందుకొని స్టార్ స్టేటస్ ను దక్కించుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
also read:కడుపునిండా తిండి పెట్టి.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్!
మరొకవైపు గత మూడు రోజుల క్రితం శ్రీవారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శనతో అందరి మన్ననలు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా క్లాసికల్ డాన్స్ తో తిరుమల కు వచ్చిన భక్తులను సైతం మైమరిపించారు డింపుల్ హయతి. మొత్తానికైతే మొన్న తిరుమల .. నేడు శ్రీకాళహస్తీశ్వర ఆలయాలలో దర్శనమివ్వడంతో అభిమానులు సైతం ఈమె భక్తి పారవస్యానికి ముగ్ధులవుతున్నారు.
గద్దలకొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ తో సూపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈమె.. కెరియర్ మొదట్లో చిన్న చిత్రాలు చేసింది. కానీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. మొదటిసారి గల్ఫ్ అనే చిత్రంతో 2017లో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. అభినేత్రి, దేవి 2, యురేకా వంటి చిత్రాలలో నటించింది. ఇక తర్వాత సామాన్యుడు, ఖిలాడి, రామబాణం వంటి చిత్రాలు చేసింది కానీ ఏవి కూడా ఈమెకు మంచి విజయాన్ని అందించలేదు. ఇక ఈ ఏడాది చివరిగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. కానీ ఈ సినిమా కూడా డింపుల్ కి మంచి విజయాన్ని అందించకపోవడం గమనార్హం. ఇక కెరియర్ లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈమె అందుకోసమే ఇలా దేవాలయాలను సందర్శిస్తోంది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా డింపుల్ హయతి భక్తికి అభిమానులు ఫిదా అవుతున్నారు.