BigTV English

Allu Arjun-Neel : అల్లు అర్జున్ – నీల్ కాంబోలో మూవీ..టైటిల్ కు విజిల్స్ పక్కా..

Allu Arjun-Neel : అల్లు అర్జున్ – నీల్ కాంబోలో మూవీ..టైటిల్ కు విజిల్స్ పక్కా..

Allu Arjun-Neel : తెలుగులో కన్నడ నటులతో పాటుగా డైరెక్టర్స్ కూడా తెలుగులో సత్తాను చాటుతున్నారు. అలాంటి వారిలో సలార్ ఫెమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒకరు. కన్నడలో కేజీఎఫ్ సిరీస్ సినిమాలను చేశాడు. ఈ భారీ చిత్రాల తర్వాత ప్రభాస్ తో సలార్ మూవీ చేశాడు. సరైన హిట్ సినిమాలు లేని ప్రభాస్ కు ఈ సినిమా కమర్షియల్ హిట్గా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’ మూవీలో కాటేరమ్మ ఫైట్‌కి ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. అయితేసలార్’ పార్ట్ 1 మూవీకి సీక్వెల్‌గా ‘సలార్ పార్ట్ 2: శౌర్యంగపర్వం’ మూవీని అనౌన్స్ చేసింది టీమ్. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోతో సినిమా చేసేందుకు డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు. ఆ హీరో ఎవరు? మూవీ డీటెయిల్స్ వివరాల్లోకి వెళితే..


అల్లు అర్జున్ తో నీల్ కొత్త మూవీ..

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో డ్రాగన్ సినిమా విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే మరో మూవీకి డైరెక్టర్ రంగం సిద్ధం చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్.. అల్లు అర్జున్‌తో ‘రావణం’ అనే మూవీని మొదలెట్టబోతున్నాడు ప్రశాంత్ నీల్. దిల్ రాజు ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది.. అసలు విషయానికొస్తే.. ప్రభాస్‌తో ‘రావణం’ మూవీని తెరకెక్కించాలని అనుకున్నాడు ప్రశాంత్ నీల్.. అయితే ప్రభాస్ ‘సలార్ 2’ మూవీకే డేట్స్ ఇవ్వడం లేదు. దాంతో ఎన్టీఆర్ తో సినిమాను ప్రకటించారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాను అనౌన్స్ చేయబోతున్నారు.


Also Read :బుధవారం టీవీ ఛానెల్స్ లోకి వచ్చే సినిమాలు.. ఆ నాలుగు వెరీ స్పెషల్..

నీల్ సినిమాలు.. 

ప్రస్తుతం ప్రభాస్‌తో పాటు ప్రశాంత్ నీల్ కూడా వేర్వేరు ప్రాజెక్టులను వరుసగా లైన్‌లో పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.720 కోట్లు వసూలు చేసింది. అంతకుముందు వచ్చిన కేజిఎఫ్ సిరీస్ సినిమాలు కూడా మంచి టాక్ని అందుకోడంతో పాటుగా బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేలా కలెక్షన్స్ అని కూడా అందుకున్నాయి. ఆ తర్వాతగా వచ్చిన మూవీ సలార్ 1.. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో డ్రాగన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఇంకా పూర్తి కాలేదు కానీ మరో సినిమాని అనౌన్స్ చేశాడు ప్రశాంత్ నీల్.. అల్లు అర్జున్ తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు . అల్లు అర్జున్ పుష్ప సిరీస్ మూవీలతో బాగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత నీల్ మూవీలో నటించే అవకాశాలు ఉన్నాయి.. ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారని సమాచారం. దీని గురించి వార్తలు వినిపిస్తున్న దిల్ రాజు ఇంకా మౌనంగా ఉన్నాడు. బడ్జెట్, హీరోయిన్, ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు వంటి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని దిల్ రాజు అంటున్నారు. మరి ఈ సినిమా బన్నీకి ఏ మాత్రం హిట్ టాక్ అని అందిస్తుందో చూడాలి..

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×