BigTV English

OTT Movie : కర్టెన్ చాటున దెయ్యం… అది ఆడే దాగుడుమూతల ఆటకు పార్ట్స్ ప్యాక్

OTT Movie : కర్టెన్ చాటున దెయ్యం… అది ఆడే దాగుడుమూతల ఆటకు పార్ట్స్ ప్యాక్

OTT Movie : సైకలాజికల్ హారర్, సూపర్‌నాచురల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఒక స్టోరీ ఓటీటీలో మంచి వ్యూస్ తెచ్చుకుంటోంది. ఇది ఇండొనేషియన్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఆసక్తి కరంగా ఉండే స్టోరీ, ఊహించని ట్విస్ట్లు , భయపెట్టే సీన్స్ తో ఈ సినిమా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ,,,


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ ఇండోనేషియన్ సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ మూవీ పేరు ‘తెమురున్’ (Temurun). 2024 లో వచ్చిన ఈ సినిమాకి ఇనారా స్యారాఫినా దర్శకత్వం వహించారు. ఇందులో యసమిన్ జాసెమ్, బ్రయాన్ డొమాని, కరీనా సువంది, జాజాంగ్ సి. నోయర్, కికీ నరేంద్ర, మియాన్ టియారా, బన్యు బెనింగ్ వంటి నటులునటించారు. ఈ మూవీ 2024 మే 30న ఇండోనేషియా థియేటర్లలో విడుదలైంది.  2024 అక్టోబర్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ దేవీ, సేనా అనే అక్కా, తమ్ముడి చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు తమ తల్లితో కలిసి సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. వీరి తల్లి అనారోగ్యంతో బాధపడుతూ, ఎప్పుడు చూసినా దిగులుగా ఉంటుంది. ఒక రోజు రాత్రి, ఇద్దరు ముసుగు ధరించిన వ్యక్తులు వీళ్ళ ఇంటిపై దాడి చేస్తారు. సేనాను అడిగి అతని తల్లిపై హింసాత్మకంగా ప్రవర్తిస్తారు. దీనివల్ల వీరి తల్లి చనిపోతుంది. ఈ విషాదకర సంఘటన దేవీని దుఃఖంలో ముంచెత్తుతుంది. అయితే సేనా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా, ఒక మంత్రి భార్యతో అక్రమ సంబంధంలో ఉంటాడు.

తల్లి మరణం తర్వాత దేవీ, సేనాల జీవితంలోకి, ఎప్పుడో విడిపోయిన తండ్రి అగుంగ్ హఠాత్తుగా వస్తాడు. అతను వారిని తనతో ఉండమని ఒత్తిడి చేస్తాడు.  అతను ఒక పెద్ద మాంసం ఉత్పత్తి వ్యాపారాన్ని నడుపుతున్నట్లు చెప్తాడు. దేవీ తన తండ్రి పట్ల అనుమానంతో ఉంటుంది. ఎందుకంటే అతను తమ తల్లి బతికి ఉన్నప్పుడు, తమను ఒక్కసారి కూడా పట్టించుకోలేదని బాధపడుతుంది.  కానీ సేనా ఈ అవకాశాన్ని వదులుకోకూడదని దేవీని ఒప్పిస్తాడు. వీళ్ళిద్దరూ తండ్రి నివసించే భవనంలోకి అడుగుపెడతారు. అక్కడ వీళ్ళ అమ్మమ్మ గాయత్రి, హౌస్‌కీపర్ హెస్టి వీళ్ళకి స్వాగతం పలుకుతారు.

వారు కొత్త జీవితంకి అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, దేవీ తన తల్లి ఆత్మ ద్వారా హాంట్ చేయబడుతుంది. ఆమె తనకు ఏదో హెచ్చరిక ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో గాయత్రి నాయకత్వంలోని, కుటుంబ రహస్యాలు క్రమంగా బయటపడతాయి. చివరికి దేవీ, సేనా లను తండ్రి ఎందుకు తన దగ్గరికి పిలుచుకుంటాడు ? తల్లి ఆత్మ దేవికి ఎం చెప్పాలనుకుంటుంది ? తండ్రి దాచిపెట్టిన సెక్రెట్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : డైరెక్షన్లు మార్చి మనుషుల్ని చంపే ఫారెస్ట్… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

Related News

OTT Movie : ఇంత కరువులో ఉన్నారేంది సామీ… మొత్తం అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు

OTT Movie : 30 ఏళ్ల క్రితం మూసేసిన రోడ్… అక్కడ అడుగు పెడితే నరకానికే… ఐఎండీబీలో 8.1 రేటింగ్

OTT Movie: వీళ్లేం మనుషులురా బాబు? అంత్యక్రియల్లో పొట్టచక్కలయ్యే కామెడీ, ఈ మలయాళ మూవీ అస్సలు మిస్ కావద్దు

OTT Movie : స్కూల్ కెళ్లే అమ్మాయితో పాడు పని… ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అని తెలిశాక వాడికి ఉంటది… అల్టిమేట్ యాక్షన్ సీన్స్

OTT Movie : ఇది సినిమానా, చికెన్ షాపా మావా? ఒక్కో పార్ట్ కట్ చేసి ఏందా అరాచకం… గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన మూవీ

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

Big Stories

×