Andhra King Taluka :మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. రా రా కృష్ణయ్య సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. సందీప్ కిషన్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా చేసిన మిస్శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది.
ఆ సినిమా తర్వాత మహేష్ బాబు చేస్తున్న సినిమా కాబట్టి మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో రామ్ పోతినేని చాలా అందంగా కనిపిస్తున్నారు. రామ్ ఎంత అందంగా ఉంటాడో అందరికీ తెలిసిన విషయమే. అయితే దానిని ప్లస్ పాయింట్ గా వాడుకుని మహేష్ బాబు ఇంకొంచెం అందంగా చూపించడం మొదలుపెట్టాడు. రామ్ సరసన భాగ్యశ్రీ నటిస్తుంది. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
ఫస్ట్ సింగిల్ రిలీజ్
ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకు వివేక్-మెర్విన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఒక ప్రత్యేకమైన పాటను రాశాడు రామ్ పోతినేని. ఈ పాటను యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ పాడారు. రామ్ పాట రాశాడు అన్నప్పుడే చాలా క్యూరియాసిటీ పెరిగింది. ఇప్పుడు అనిరుద్ ఈ పాటను పాడడంతో మంచి హై ఫీల్ వచ్చింది. వీటన్నిటిని మించి రామ్ ఇంత గొప్ప సాహిత్యం రాశాడు అంటే అది మామూలు విషయం కాదు. యంగ్ హీరో పాటను రాస్తాడు అంటే అదేదో నార్మల్ గా ఉంటుంది అనుకున్నారు. కానీ చాలా పోయిటిక్ వే లో రాశాడు.
దారిలేని ఊరినే అడిగానుగా
నువ్వేగా దారని నాకు చూపుతుంది
కమ్ముకున్న మబ్బులో వెతికానుగా
అరే గాలివానై నన్ను తాకుతుంది.
వంటి లైన్స్ ప్రస్తుతం ఉన్న పెద్ద సాహిత్య రచయితలు మాత్రమే రాయగలరు. కానీ రామ్ ఇలా రాసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
కొనసాగించిన తప్పులేదు
ఇక ఈ పాట విషయానికి వస్తే లిరిక్స్ చూసిన తర్వాత ముందు ముందు రామ్ పోతినేని ఇంకా ఎన్నో పాటలు రాయొచ్చు. తన సినిమాలలో కాకుండా మిగతా సినిమాలలో రాసిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అనిరుద్ రవిచంద్రన్ ఈ పాటను పాడిన విధానం కూడా చాలా ఆకట్టుకుంది. మధ్యలో కొన్న విజువల్స్ ఒక క్యూట్ లవ్ స్టోరీ చూడబోతున్నాం అనే ఫీల్ ని కూడా క్రియేట్ చేస్తున్నాయి. ఏదేమైనా ఈ సినిమాతోని రామ్ పోతినేని గట్టి హిట్ అందుకునేటట్లే ఉన్నాడు.