IND vs Pak : సాధారణంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అది క్రికెట్ అయినా.. ఫుట్ బాల్ అయినా, హాకీ అయినా, కబడ్డీ అయినా ఏ క్రీడారంగం అయినా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కి అంతటి క్రేజ్ ఉంటుంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందంటే కొంత మంది పనులు ఎగ్గోట్టి మరీ చూస్తుంటారు. అలాంటిది ఇంటర్నేషనల్ మ్యాచ్ ఒక్కటి ఎల్లుండి జరుగనుంది. అది టీమిండియా-పాకిస్తాన్ జట్లకు మధ్య జరుగనుంది. ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్ మధ్య జులై 20న జరుగనుంది.
Also Read : Match Referee : క్రికెట్‌లో మ్యాచ్ రిఫరీ ఏం చేస్తారు.. అతని వర్క్ ఏంటి?
ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు
మాజీ క్రికెటర్లు పాల్గొనే వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ టీ-20 టోర్నీ ఇవాళ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగనున్న ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. వాటిలో ఇండియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఇవాళ తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. టీమిండియా యువరాజ్ సారథ్యంలో ఆడనుంది. భారత జట్టు తన తొలి మ్యాచ్ ని జులై 20న పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది. తొలి సీజన్ ఫైనల్ లో పాకిస్తాన్ పై యువరాజ్ సారథ్యంలో జట్టు విజయం సాధించింది. ఆ మ్యాచ్ తరువాత పాకిస్తాన్ తోనే తొలి మ్యాచ్ లో తలపడనుంది టీమిండియా. ఇక భారత జట్టు ఈనెల 20న పాకిస్తాన్, 22న సౌతాఫ్రికా, 26న ఆస్ట్రేలియా, 27న ఇంగ్లాండ్, 29న వెస్టిండీస్ తో ఢీ కొట్టనుంది. ఆగస్టు 02న WCL ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ ఛానల్, ఫ్యాన్ కోడ్ యాప్ లో లైవ్ ని వీక్షించవచ్చు.
Also Read : Jos Buttler: టీమిండియా బలుపు వల్లే.. లార్డ్స్ లో ఓడిపోయారు
ఈ సారి టైటిల్ ఎవరిదో..?
గత సీజన్ లో టైటిల్ సాధించిన భారత జట్టు ఈసారి మళ్లీ అదే కోవలో పయణిస్తుందని టీమిండియా క్రీడాభిమానులు పేర్కొంటే.. సౌతాఫ్రికా జట్టుకి ఈ సారి డివిలియర్స్ రావడం.. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం తో ఆ జట్టు బలంగా కనిపిస్తుందని మరికొందరూ పేర్కొంటున్నారు. టీమిండియా లో యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, సురేష్ రైనా వంటి బ్యాటర్లు ఉండగా.. వరుణ్ అరుణ్, వినయ్ కుమార్, హర్భజన్ సింగ్, స్టువర్ట్ బిన్ని వంటి బౌలర్లు.. ఇర్ఫాన్ పఠాన్, యూసూఫ్ పఠాన్ వంటి ఆల్ రౌండర్లతో జట్టు బలంగానే ఉంది. భారత జట్టు తొలి టీ-20 టైటిల్ ను పాకిస్తాన్ పై 2007లో విజయం సాధించడం.. అలాగే WCL తొలి టైటిల్ ను కూడా భారత్ సాధించింది. అయితే టైటిల్స్ లో ప్రత్యర్థి జట్టు పాకిస్తానే కావడం విశేషం. ఈ సారి WCL టైటిల్ ఏ జట్టు సాధిస్తుందో వేచి చూడాలి మరీ.