E-Paper
Advertisement

Film Chamber Elections: దిగొచ్చిన ప్రెసిడెంట్.. ఎట్టకేలకు ఎన్నికల ప్రకటన..

Film Chamber Elections: దిగొచ్చిన ప్రెసిడెంట్.. ఎట్టకేలకు ఎన్నికల ప్రకటన..
Advertisement

Film Chamber Elections: ఎట్టకేలకు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల వివాదం ఓ కొలుక్కి వచ్చింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలకు తాజాగా నగరా మోగింది. ఎట్టకేలకు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రస్తుతం అధ్యక్షుడు భరత్ భూషన్. కొన్ని రోజులుగా ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ఇండస్ట్రీ పెద్దలకు పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే ఎన్నికలు జరిగిన కొత్త కమిటీ ఏర్పడాలి. గడువు ముగిసి కూడా నాలుగు నెలలపైనే అవుతుంది.

దిగొచ్చిన ప్రెసిడెంట్

Advertisement

కానీ, ఇప్పటి వరకు ఎన్నికలపై ఎలాంటి స్పష్టత లేదు. ఛాంబర్ ఎన్నికలు అని అడిగిన ప్రతిసారి ప్రెసిడెంట్ ససేమిరా అంటూ వచ్చాడు. దీంతో ఇండస్ట్రీ పెద్దలు, బడా నిర్మాతలైన అల్లు అరవింద్, సురేష బాబు రంగంలోకి దిగి చాంబర్ సమస్యని పరిష్కరించే దిశ చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఇవాళ (నవంబర్ 16) ఫల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ తో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. చర్చల అనంతరం ప్రెసిడెంట్ భరత్ భూషణ్ దిగొచ్చు ఎన్నికలకు సిద్ధమయ్యారు.

డిసెంబర్ ఎన్నికలు

డిసెంబర్ ఫల్మ్ ఛాంబర్ ఎన్నికలు నిర్వహించనున్నట్టు మీటింగ్ లో ప్రకటించారు. డిసెంబర్ నెలఖారులో ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీని నియమించాలని నిర్ణయించారు. దీంతో ఇండస్ట్రీ వర్గాలంత సంతోషం వ్యక్తం చేశాయి. చివరికి ఛాంబర్ కు మంచి రోజులు వచ్చాయంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రోజు సినీ పెద్దలు అల్లు అరవింద్, సురేష్ బాబు ఇతర బడా నిర్మాతలు అధ్యర్వంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన ప్రస్తుత ప్రెసిడెంట్ భరత్ భూషణ్ పలు చర్చల అనంతరం ఎన్నికలను ప్రకటించడం టాలీవుడ్అం మొత్తం పండగ చేసుకుంటుంది. 

వాయిదా వేయాలనే డిమాండ్

Advertisement

నిజానికి TFCC (తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్) రూల్స్ ప్రకారం… ఇప్పటికే ఛాంబర్ కు ఎన్నికలు జరగాలి. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి కొత్త ప్రెసిడెంట్‌తో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి. గత 30 ఏళ్లుగా ఇదే కొనసాగుతుంది. అప్పట్లో… రాష్ట్రం విడిపోయిన తర్వాత ఓ సారి… కరోనా టైంలో రెండో సారి మాత్రమే… ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలను వాయిదా వేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. గతంలో ఉన్న కార్యవర్గాన్నే కంటీన్యూ చేశారు. అప్పుడంటే ప్రత్యేక పరిస్థితులు కాబట్టి వాయిదా వేశారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకపోయిన ఎన్నికలు జరపకపోవడం అందరిని ఆందోళనకు గురి చేసింది.

Also Read: Mahesh Babu: వెయిట్ ఈజ్ ఓవర్.. ‘వారణాసి‘ లుక్ తోనే ఎంట్రీ.. మహేష్ రాకతో దద్దరిల్లిన గ్లోబ్ ట్రాటర్

అదే కారణమా?

ఎన్నికల జరిపించాలని అడిగిన ప్రతిసారి భరత్ భూషణ్ మాట దాటేస్తు వస్తున్నారు. గట్టిగా అడిగితే ఎన్నికలు వాయిదా వేయాలని మొండిపట్టుపడుతున్నారు. దీంతో ఎన్నికలు ఎందుకు వాయిదా వేస్తున్నారనే దానిపై ఇండస్ట్రీ పెద్దలు, వర్గాలకు అర్థం కాక తలలు పట్టుకున్నారు. దీనికి కారణంచిత్రపురి కాలనీ ఆస్తులకు లింక్స్ ఉన్నాయనే ఇండస్ట్రీలో గుసగుసల వినిపించాయి. మొన్నటి వరకు సినీ పద్దలకు తలనొప్పిగా ఉన్న ఛాంబర్ ఎన్నికల వివాదం కొలిక్కి రావడంతో అంత సంబరాలు చేసుకుంటున్నారు.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×