Anji Movie: తెలుగు సినీ హిస్టరీలో ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకున్న సినిమా ఏంటో తెలుసా.. అదే అంజి.ఎస్. ఆర్ట్ మూవీస్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ సోషియో ఫాంటసీ లో . చిరంజీవి, నమ్రతా శిరోద్కర్, టినూ ఆనంద్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు .ఎం. ఎస్. ఆర్ట్స్ మూవీస్ యూనిట్ ఈ చిత్ర కథ, స్క్రీన్ ప్లే చేయగా, పి. సత్యానంద్ మాటలు. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా షూటింగ్ డేస్ ని అఫీషియల్ గా ఎవరు రికార్డ్ చేయకపోయినా ఈ సినిమా నిర్మాణం జరిగిన తీరు ,విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా పట్టిన సమయం అన్నీ కలిపి ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకున్న ప్రాజెక్టుగా తెలుగు సినిమా హిస్టరీలో నిలిచిపోయింది .
అసలు ఒక టాప్ హీరో నటించిన ఒక సినిమా ఇన్ని ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటో, ఆ కాలంలో ఎదురైన ఆ సవాళ్లేంటో,చివరికి ఆ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో ఒకసారి చూద్దాం .
ఏకంగా దాదాపు ఆరు సంవత్సరాలు పాటు
అంజి సినిమా 1998లో శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మాణంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో మొదలైంది.అప్పటికే అమ్మోరు సినిమాతో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై గ్రాఫిక్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్యాం ప్రసాద్ రెడ్డి, ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాలని ఒక గట్టి సంకల్పంతో ఈ అంజి అనే భారీ అడ్వెంచర్ ని ప్లాన్ చేశాడు.ఇక కోడి రామకృష్ణ కూడా అప్పటివరకు ఎవరు ఊహించని స్థాయిలో విజువల్స్ ప్లాన్ చేయడంతో సినిమా పట్టాలెక్కింది.అయితే అప్పుడు మొదలెట్టినప్పుడు ఈ సినిమా ఏకంగా దాదాపు ఆరు సంవత్సరాలు పాటు మెగా సీరియల్ గా సాగుతుందని ఎవరు ఊహించి ఉండకపోవచ్చు .
అయితే దీనికి ప్రధాన కారణం ఆ రోజుల్లో ఇండియాలో CG 3డి యానిమేషన్ సదుపాయాలు అందుబాటులో లేకపోవడమే. దీంతో సినిమాలో ముఖ్యమైన 20 నుంచి 24 నిమిషాల గ్రాఫిక్స్ వర్క్స్ కోసం విదేశీ స్టూడియోలపైనే ఆధారపవలసి వచ్చింది.ఇక నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి తనే స్వయంగా లండన్ వంటి నగరాలకు వెళ్లి అక్కడి సాంకేతి సాంకేతిక నిపుణులతో VFX పనులని దగ్గరుండి చూడాల్సి వచ్చింది ఆ కాలాన్నిబట్టి చూస్తే ఈ వ్యవహారమంతా చాలా ఖర్చుతో కూడుకున్నదని చెప్పాలి.
క్లైమాక్స్ కంప్లీట్ చేయడానికి ఏకంగా 6 నెలల సమయం
కేవలం టెక్నికల్ గానే కాకుండా షూటింగ్ కోసం కూడా ఏ సినిమా యూనిట్ కూడా అంతకు ముందు ఎన్నడూ లేని సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది.ఉదాహరణకి సినిమాలో విగ్రహాన్ని దొంగిలించే సీనే షూట్ చేయడానికి దాదాపు ఒకటిన్నర నెల సమయం పట్టిందట .అలాగే సినిమాలో కీలకమైన ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం 40 రోజులు కేటాయించిన మూవీ టీం, క్లైమాక్స్ కంప్లీట్ చేయడానికి ఏకంగా 6 నెలల సమయం పట్టిందంటే ఈ సినిమా మేకింగ్ ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక క్లైమాక్స్ లో వచ్చిన VFX షాట్స్ పర్ఫెక్ట్ గా రావడం కోసం విదేశాల్లో మరిన్ని రోజులు షూటింగ్ జరిపిందట మూవీ టీం.అలా ఈ సుదీర్ఘ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి చూపిన సహనం ,అంకితభావం ఇప్పటికీ టాలీవుడ్ లో ఒక బెంచ్ మార్క్ అని చెప్పక తప్పదు.
ఏకంగా ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్
ఇక క్లైమాక్స్ సీన్స్ లో ఉపయోగించిన చిరిగిపోయిన కాస్ట్యూమ్ ని అలాగే ఏమాత్రం కంటిన్యూటీ పోకుండా సంవత్సరాలపాటు దాన్ని కాపాడి షూటింగ్ ని కొనసాగించారు.ఒక స్టార్ హీరో ఒక ప్రాజెక్టు కోసం ఇన్ని రోజుల పాటు డేట్స్ కేటాయించడం చాలా రేర్ అనే చెప్పాలి .ఇక ఈ సినిమా జర్నీలో కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు సంగీత పరంగాను ఎన్నో మార్పులు చూసిందిఅవును ఈ సినిమా కోసం ఏకంగా ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్ పని చేయగా చివరికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ తన అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ తో పాటు సినిమా సంగీత బాధ్యతలని భుజాన వేసుకున్నాడు .ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా తెలుగులో ఒక రికార్డు అని చెప్పాలి .
జనవరి 15 2004 న థియేటర్లలో విడుదలైన సినిమా
మొత్తానికి 1998లో మొదలైన ఈ సినిమా అన్ని అడ్డంకులను దాటుకొని చివరికి 2004లో ఆడియన్స్ ముందుకి వచ్చింది .అయితే ఈ ఆరేళ్ల కాలంలో హాలీవుడ్లో విజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీ పరంగా ఎంతో దూసుకుపోయింది .దాంతో 1998 కాలంలో ఎంతో గొప్పగా అనిపించిన కొన్ని గ్రాఫిక్స్ విజువల్స్ 2004నాటి ఆడియన్స్ విజువల్ స్టాండర్డ్స్ కి మ్యాచ్ కాలేదని చెప్పాలి.అయినప్పటికీ ఆ కాలంలోనే అంతటి విఎఫ్ఎక్స్ ని ఊహించిన నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి ,దర్శకుడు కోడి రామకృష్ణుల విజన్ ని మెచ్చుకొని తీరాల్సిందే.
ఇక జనవరి 15 2004 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా మంచి అప్లాజ్ దక్కినప్పటికీ సినిమాకు పెట్టిన భారీ బడ్జెట్ ని వసూళ్ల రూపంలో రాబట్టలేకపోయింది ఈ సినిమా.టెక్నికల్ పరంగా వండర్ గా నిలిచిన ఈ సినిమాకి బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో జాతీయ పురస్కారం దక్కడం కాస్త ఊరట అని చెప్పాలి .ఆ తర్వాత కాలంలో బాహుబలి వంటి సినిమాలు రెండు నుంచి నాలుగు సంవత్సరాల పాటు తీసుకోగా కేవలం ఒకే ఒక్క సినిమా కోసం ఆరేళ్ళ కాలం ని తీసుకున్న సినిమాగా అంజి రికార్డులకు ఎక్కింది.