Akhil Fan: అది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా ఆడుతున్న థియేటర్ ..అక్కినేని నాగార్జున రెండో కొడుకు అఖిల్ హీరోగా వచ్చిన సినిమా అది .అక్కినేని ఫ్యాన్స్ గా అందరు అభిమానులు వచ్చారు.కానీ ఒక్క అభిమాని మాత్రం అఖిల్ ని నమ్ముకుని వచ్చాడు .
దానికి కారణం ఈ అభిమానే
అప్పటి వరకు వచ్చిన సినిమాలు పోయినా ‘అఖిల్ ఇండస్ట్రీని ఏలేస్తాడని అయ్యగారే నెంబర్ వన్ అని ఆయనే రావాలి’ అంటూ ఆ అభిమాని చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.ఇక క్రమక్రమంగా అఖిల్ పేరు పక్కన అయ్యగారు అనేది ఒక బ్రాండ్ గా అయిపోయిందంటే దానికి కారణం ఈ అభిమానే.అప్పట్లో అఖిల్ కూడా ఈ అభిమానం చూసి ఎమోషన్ అయిపోయాడు.
also read:తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు చెళియన్ కన్నుమూత
లెనిన్ థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వడంతో
ఇక దాదాపు మూడేళ్లుగా అఖిల్ నుంచి ఒక్క సినిమా రాకపోవడంతో అడ్రస్ లేకుండా పోయాడు ఈ అభిమాని.మళ్లీ అఖిల్ సినిమా లెనిన్ థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ ఈ అయ్యగారి ఫ్యాన్ హడావిడి మొదలైపోయింది .థియేటర్ దగ్గర కటౌట్‌కు పూలమాలలు వేసి మీడియా ముందు తనదైన స్టైల్ లో ఎలివేషన్లు ఇచ్చేశాడు.
ఇక్కడ అసలైన విషయం ఏంటంటే.. ఈ ఇండస్ట్రీలో, ఆఖరికి అక్కినేని కాంపౌండ్ లో కూడా అఖిల్ ని ఎవరు పెద్దగా నమ్మని సమయంలో ఈ అభిమాని మాత్రం అఖిల్ ని గుడ్డిగా నమ్మేశాడు.అఖిల్ ట్రాక్ రికార్డు చూసి థియేటర్ కి వెళ్ళాలా వద్దా అని అభిమానులు 100 సార్లు ఆలోచిస్తుంటే ఈ అభిమాని మాత్రం నా అయ్యగారే కరెక్ట్ అంటూ థియేటర్లో తెగ సందడి చేశాడు.సినిమా ఎలా ఉన్నా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా తను నమ్మిన అయ్యగారు టాలీవుడ్ ను వేలేస్తాడని ఏంతో ఆశతో ఉన్నాడు.
ఆ అభిమాని నమ్మకాన్ని వమ్ము చేయకుండా
నిజానికి లెనిన్ సినిమా కోసం మూవీ టీం చేసిన ప్రమోషన్స్ అంతా ఒకెత్తు .అవును కోట్లు ఖర్చు పెట్టి సినిమా కి ఆడియన్స్ ని రప్పించే పనిలో పడితే ఈ అభిమాని మాత్రం తన గుడ్డి నమ్మకంతో సినిమాకి మరోసారి సాలిడ్ గా ప్రమోషన్స్ ని చేస్తున్నాడు.ఎవరు నమ్మిన నమ్మకపోయినా ఈ అభిమాని మాత్రం తను నమ్మిన అఖిల్ ఈసారైన ఇండస్ట్రీని ఏలేస్తాడని ఆశగా థియేటర్ కి వచ్చాడు.మరి థియేటర్ కు వచ్చిన ఆ అభిమాని నమ్మకాన్ని అఖిల్ వమ్ము చేయకుండా ఉంటాడా ,ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అసలైన హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడా అనేది ఒకరోజు గడిస్తే కాని చెప్పలేము !
also read:తండ్రి చనిపోయిన రోజే ఆ పని.. ‘రక్తకన్నీరు’ నాగభూషణం లైఫ్‌లో ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు!