BigTV English
Advertisement

Mass Jathara : ప్రీమియర్స్ కలెక్షన్ పోస్టర్స్ తర్వాత మరో పోస్టర్ లేదు, నాగ వంశీకి పరిస్థితి అర్థం అయిపోయిందా?

Mass Jathara : ప్రీమియర్స్ కలెక్షన్ పోస్టర్స్ తర్వాత మరో పోస్టర్ లేదు, నాగ వంశీకి పరిస్థితి అర్థం అయిపోయిందా?

Mass Jathara : రీసెంట్ టైంలో ఒక సినిమా హిట్ అవడం అనేది మామూలు విషయం కాదు. ప్రేక్షకులకు ఏ సినిమాలు నచ్చుతున్నాయి ఎందుకు నచ్చుతున్నాయి అని అవగాహన కూడా చాలామంది నిర్మాతలకు రావడం లేదు. సినిమా చూసే విధానం కూడా కంప్లీట్ గా మారిపోయింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తన టాలెంట్ నమ్ముకొని కష్టపడి స్టార్ హీరోలుగా స్థిరపడిన వ్యక్తులలో రవితేజ ఒకరు.


రవితేజ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామందికి ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ అలా ఉంటారు. కానీ ఎటువంటి యాంటీ ఫ్యాన్స్ లేని ఏకైక హీరో రవితేజ. ముఖ్యంగా రవితేజ గురించి ట్రోలింగ్స్ వచ్చే సందర్భాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. స్వతహాగా అసిస్టెంట్ డైరెక్టర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కాబట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలామంది కొత్త దర్శకులను కూడా పరిచయం చేసిన ఘన రవితేజకు ఉంది.

కలెక్షన్స్ తర్వాత మరో పోస్టర్ లేదు 

రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలైంది. ఈ సినిమాకి ప్రీమియర్ షోస్ కూడా పడ్డాయి. అయితే ప్రీమియర్ షో నుంచి ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చేసింది.


ఒక సినిమా రిలీజ్ రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఆ సినిమా షెడ్డు కు వెళ్లిపోయినట్టే. ఇక సినిమా రెండవ రోజు చూస్తే కంప్లీట్ టాక్ మారిపోయింది. రొటీన్ సినిమా అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి. మామూలుగా సినిమా కలెక్షన్స్ అఫీషియల్ గా పోస్ట్ చేస్తూ ఉంటారు.

ఈ సినిమాకి సంబంధించి మొదట ఐదు కోట్ల వరకు ప్రీమియర్ షోస్ కు వచ్చినట్లు పోస్టర్ వేశారు. ఆ తర్వాత నుంచి కలెక్షన్స్ పోస్టర్ లేదు.అయితే ఈ సినిమాకి సంబంధించి కేవలం బ్లాక్ బస్టర్ హిట్ అనే పోస్టర్స్ మాత్రమే పడుతున్నాయి. ఫ్యాన్స్ హ్యాపీనెస్ కోసము పోస్టర్లు వేస్తాము అని పలు సందర్భాల్లో నాగవంశీ చెప్పారు కానీ ఈ సినిమాకి అలా చేయడం లేదు.

నాగ వంశీకి పరిస్థితి అర్థం అయిందా? 

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ యంగ్ ప్రొడ్యూసర్స్ లో నాగవంశీ ఒకరు. కేవలం ప్రొడ్యూసర్ గానే కాకుండా చాలామంది తనను నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్ల కోసం చాలా నిలబడతారు అనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంటాయి.

రీసెంట్ ఇంటర్వ్యూలో నిర్మాత ధీరజ్ మొగిలినేని కూడా నాగ వంశీ గొప్పతనాన్ని చెప్పాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మంచి సినిమాలను నిర్మించింది అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ 2025 లో మాత్రం ఏవి పెద్దగా వర్కౌట్ కావడం లేదు. డాకు సినిమాకు ఊహించిన సక్సెస్ రాలేదు. డిస్ట్రిబ్యూషన్ చేసిన వార్ 2 సినిమా వర్కౌట్ కాలేదు. మాస్ జాతర సినిమా ద్వారా కూడా దాదాపు పది నుంచి 15 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు తెలుస్తుంది.

Also Read: Sundeep Kishan : ఫస్ట్ లుక్ రెడీ, దుల్కర్ సల్మాన్ రిజెక్ట్ చేసిన ప్రాజెక్టులో సందీప్ కిషన్

Related News

Spirit : వాట్ ఏ సడన్ సప్రైజ్, ప్రభాస్ స్పిరిట్ పూజ రేపే

Ram Pothineni : రామ్ చరణ్ దారిలో రామ్ పోతినేని, ఇది శుభ పరిణామం

Prabhas -Rashmika : ప్రభాస్ సినిమాలో రష్మిక.. చచ్చిపోతానన్న నెటిజెన్.. ఏమైందంటే?

Bandla Ganesh: ఒక్క సినిమా హిట్టు కొడితే, అలా బిహేవ్ చేస్తారు, బండ్ల కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి?

Bandla Ganesh: కిరణ్ అబ్బవరం రియల్ హీరో.. చిరంజీవితో పోల్చిన బండ్ల గణేష్!

Rajesh Danda: అలా చేయకుండా ఉండాల్సింది, ప్రొడ్యూసర్ రిలైజేషన్

Bandla Ganesh: సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్ లు వర్కౌట్ అవ్వవు.. రిక్వెస్టుల మాత్రమే!

The Girl Friend censor: సెన్సార్ పూర్తి చేసుకున్న రష్మిక ది గర్ల్ ఫ్రెండ్.. రన్ టైం ఎంతంటే?

Big Stories

×